News April 24, 2024
పదో తరగతి ఫలితాల్లో నెల్లూరు జిల్లాకు 15వ స్థానం

పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రంలో నెల్లూరు జిల్లా 88.17% ఉత్తీర్ణతతో 15 స్థానంలో నిలిచింది. 27,788 మంది పరీక్షలు రాయగా 24500 మంది పాస్ అయ్యారు. 13926 మంది బాలురు పరీక్షలు రాయగా 12003 మంది పాస్ అయ్యారు. 13862 మంది
బాలికలు పరీక్ష రాయగా 12497 మంది పాస్ అయ్యారు. అటు తిరుపతి జిల్లాలో 26625 మందికి 24151 మంది పాస్ అయ్యారు.
Similar News
News March 10, 2026
ఎందుకొస్తున్నారు.. ఏం చేస్తున్నారు: నెల్లూరు కలెక్టర్

ఎందుకు వస్తున్నారు? ఏం చేస్తున్నారంటూ కలెక్టరేట్ అధికారులను కలెక్టర్ హిమాన్షు శుక్లా ప్రశ్నించారు. సోమవారం కలెక్టరేట్ ఆవరణంలోని తిక్కన ప్రాంగణంలో జరుగుతున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికకు హాజరైన కలెక్టరేట్‌లోని పలు సెక్షన్ల అధికారులను పిలిపించి ఆయన క్లాస్ పీకారు. ప్రజల నుంచి అర్జీలు తీసుకుని పరిశీలించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. వచ్చే వారం నుంచి బయట కూర్చుని ప్రజల అర్జీలు తీసుకోవాలని ఆదేశించారు.
News March 10, 2026
ధాన్యం సేకరణ పారదర్శకంగా జరగాలి: నెల్లూరు కలెక్టర్

నెల్లూరు జిల్లాలో 161 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ హిమాన్షు శుక్ల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డితో కలిసి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రైతులకు ఇబ్బంది లేకుండా గన్నీ బ్యాగులు, GPS రవాణా వాహనాలను సిద్ధం చేయాలని సూచించారు. తేమ శాతం, తూకాల విషయంలో రైతులకు అన్యాయం జరగకుండా చూడాలని స్పష్టం చేశారు.