News December 24, 2025
మన్యం: గిరిజన గ్రామాల్లో ఫ్యామిలీ ముస్తాబు

గిరిజన గ్రామాల్లో ఫ్యామిలీ ముస్తాబు, గిరిజన ప్రాంతాల్లోని ప్రజల జీవనశైలిని అర్థం చేసుకోవడానికి ‘గిరిజనుల ఇళ్లకు వెళ్లానున్న ఎంపీడీవోలు’ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంపీడీవో తమ పరిధిలోని మారుమూల గిరిజన గ్రామాలను సందర్శిస్తారన్నారు. వారికి ఆరోగ్యం, పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తారని పేర్కొన్నారు.
Similar News
News December 27, 2025
నేర శాతం 9.65 శాతం పెరిగింది: భద్రాద్రి ఎస్పీ

భద్రాద్రి జిల్లా పరిధిలో పోలీసు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ అసాంఘిక కార్యకలాపాలను అదుపు చేయడంలో, శాంతిభద్రతల పరిరక్షణలో ముందంజలో ఉన్నామని ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. శనివారం ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో వార్షిక నివేదిక-2025 వార్షిక నివేదిక బుక్ లెట్‌ను విడుదల చేశారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గత ఏడాదితో పోలిస్తే 9.65 శాతం నేరాల శాతం పెరిగిందని అన్నారు.
News December 27, 2025
నారాయణపేట: చైనా మాంజా విక్రయిస్తే చర్యలు తప్పవు: ఎస్పీ

నారాయణపేట జిల్లాలో ప్రభుత్వం నిషేధించిన చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ వినీత్ హెచ్చరించారు. ఈ మాంజా మనుషులు, పక్షులు, పర్యావరణానికి ప్రాణాపాయమని పేర్కొన్నారు. విక్రయదారులపై నిఘా ఉంచేందుకు జిల్లావ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తామని, ప్రజలు వీటి వినియోగానికి దూరంగా ఉండి సహకరించాలని ఆయన కోరారు.
News December 27, 2025
శ్రీకాకుళం: ఎస్పీకి దువ్వాడ ఫిర్యాదు

జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డిని శనివారం రాత్రి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కలిశారు. తాజాగా తనపై దాడి చేసేందుకు కొందరు ప్రయత్నం చేస్తున్నారని, ఈ క్రమంలో బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఎస్పీకి దువ్వాడ వివరించారు. గతంలో కూడా తనపై దాడి చేస్తామని బెదిరిస్తూ కాల్స్ చేశారని అప్పుడు కూడా పోలీసులకు పిర్యాదు చేసినట్లు దువ్వాడ తెలిపారు. దీనిపై పరిశీలన చేసి చర్యలు తీసుకుంటామని ఎస్పీ అన్నారు.


