News December 24, 2025
టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడిగా ముత్యాల బాబ్జి

కోనసీమ జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడిగా నియమితులైన ముత్యాల బాబ్జిని బుధవారం పార్టీ నాయకులు ఘనంగా సత్కరించారు. పార్టీ కోసం ఆయన చేసిన నిరంతర సేవలు, క్రమశిక్షణను గుర్తించిన అధిష్టానం ఈ కీలక బాధ్యతను అప్పగించిందని నేతలు పేర్కొన్నారు. ముత్యాల బాబ్జి నియామకంపై కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. పార్టీ బలోపేతానికి, ప్రజాసేవకు ఆయన మరింత కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
Similar News
News December 27, 2025
సంగారెడ్డి: వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి దుర్మరణం

చౌటకూర్ మండలం శివంపేట శివారులోని హైవే-161పై శుక్రవారం జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం చెందారు. మహారాష్ట్రకు చెందిన షేక్ కరీం(36) ప్రయాణిస్తున్న బోలేరో వాహనం ముందు వెళ్తున్న కంటైనర్‌ను బలంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. నిజాంసాగర్ మండలం జక్కాపూర్‌కు చెందిన కొండగల్ల విట్టల్(36) బైక్ అదుపుతప్పి కిందపడటంతో గాయాలై మరణించారు. పోలీసులు కేసులు నమోదు చేశారు.
News December 27, 2025
MSMEలకు పెరుగుతున్న రుణ వితరణ

దేశంలోని MSMEలకు బ్యాంకులు, NBFCలు తదితరాల నుంచి రుణ వితరణ పెరుగుతోంది. గతేడాదితో పోలిస్తే ఈ సెప్టెంబర్ నాటికి 16% పెరిగి రూ.46లక్షల కోట్లకు చేరింది. యాక్టివ్ లోన్ ఖాతాలూ 11.8% పెరిగి 7.3 కోట్లకు చేరాయి. కేంద్ర రుణ పథకాలతో పాటు విధానపరమైన మద్దతు దీనికి కారణంగా తెలుస్తోంది. గత రెండేళ్లలో MSME రుణ చెల్లింపుల్లో కూడా వృద్ధి కనిపించింది. 91-180 రోజుల ఓవర్ డ్యూ అయిన లోన్‌లు 1.7% నుంచి 1.4%కి తగ్గాయి.
News December 27, 2025
శనివారం రోజు చేయకూడని పనులివే..

శనిదేవుని ఆగ్రహానికి గురికాకుండా ఉండాలంటే శనివారం రోజున జుట్టు, గోర్లు కత్తిరించడం, ఉప్పు, నూనె, ఇనుము, నల్ల మినపప్పు వంటి వస్తువులను కొనడం మానుకోవాలని పండితులు చెబుతున్నారు. మాంసం, మద్యానికి దూరంగా ఉంటూ పేదలను, నిస్సహాయులను వేధించకుండా ఉండాలని సూచిస్తున్నారు. ‘కూతురిని అత్తారింటికి పంపకూడదు. నూనె, నల్ల మినపప్పు దానం చేయాలి. ఫలితంగా శని ప్రభావం తగ్గి, జీవితంలో సుఖశాంతులు చేకూరుతాయి’ అంటున్నారు.


