News December 24, 2025
KMR: సైబర్ బాధితులకు రూ.1.07 కోట్లు వాపస్!

కామారెడ్డి జిల్లాలో గతేడాది జిల్లాలో 200 సైబర్ కేసులు నమోదు కాగా, ఈ ఏడాది ఆ సంఖ్య 160కి తగ్గింది. ముఖ్యంగా, సైబర్ మోసాలకు గురైన బాధితులకు లోక్ అదాలత్, కోర్టు ఉత్తర్వుల ద్వారా రూ.1,07,31,518 విలువైన సొత్తును తిరిగి ఇప్పించడం విశేషం. 2024లో 35 NDPS కేసులు నమోదు కాగా, ఈ ఏడాది ఆ సంఖ్య 23కి తగ్గింది. నిరంతర నిఘా, కఠిన తనిఖీలు చేపట్టడం ద్వారా జిల్లాలో గంజాయి సరఫరాను అడ్డుకోగలిగారు.
Similar News
News December 28, 2025
NTR: చపాతీ ముక్క గొంతులో ఇరుక్కుని వ్యక్తి మృతి

చపాతీ ముక్క ప్రాణం తీసిన ఘటన విజయవాడలోని చిట్టినగర్‌లో విషాదం నింపింది. తోట ప్రసాద్ అనే వ్యక్తి శనివారం చపాతీ తింటుండగా ఒక్కసారిగా చపాతి ముక్క గొంతులో ఇరుక్కుపోయింది. కుటుంబ సభ్యులు బయటకు తీసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. 108 సిబ్బంది వచ్చేలోపే ఆయన ప్రాణాలు కోల్పోయారు.
News December 28, 2025
జిల్లా అధ్యక్షుడి తీరుపై అధిష్ఠానం సీరియస్..!

నల్డొండ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఇటీవల చోటుచేసుకున్న ఘర్షణపై పార్టీ అధిష్ఠానం స్పందించింది. వాజ్‌పేయి జయంతి వేడుకల్లో జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి సమక్షంలోనే నాయకుడు పిల్లి రామరాజుపై జరిగిన దాడిని రాష్ట్ర నాయకత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనతో పార్టీ ప్రతిష్ఠ దెబ్బతిందని భావించిన రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు.. వర్షిత్‌రెడ్డిని పిలిపించి మందలించినట్లు తెలుస్తోంది.
News December 28, 2025
భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తాం: ములుగు ఎస్పీ

మేడారం వన దేవతల దర్శనానికి ముందస్తు మొక్కుల చెల్లింపు కోసం వచ్చే భక్తులకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నట్లు ఎస్పీ రామనాథన్ కేకన్ తెలిపారు. ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో మేడారం రానున్న నేపథ్యంలో గద్దెల వద్ద ఏర్పాటులను ఎస్పీ పరిశీలించారు. పునర్నిర్మాణ పనుల వల్ల భక్తులకు అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట జిల్లా పోలీసు అధికారులు ఉన్నారు.


