News April 24, 2024
విశాఖ@8..అల్లూరి@9..అనకాపల్లి@12 స్థానం

➤ విశాఖ జిల్లాలో మొత్తం 28,299 మందికి 25,794 మంది పాసయ్యారు. 91.15 ఉత్తీర్ణత శాతంతో రాష్ట్రంలో 8వ స్థానంలో నిలిచింది. (గతేడాది 76.66% ఉత్తీర్ణత)
➤ అల్లూరి జిల్లాలో 10,823 మందికి 9,843 మంది పాసయ్యారు. 90.95 ఉత్తీర్ణత %తో 9వ స్థానంలో నిలిచింది. (గతేడాది 61.41% ఉత్తీర్ణత)
➤ అనకాపల్లి జిల్లాలో 21,169 మందికి 18,848 మంది పాసయ్యారు. 89.04 ఉత్తీర్ణత %తో 12వ స్థానంలో నిలిచింది. (గతేడాది 77.74% ఉత్తీర్ణత)
Similar News
News October 11, 2025
విశాఖ జిల్లాలో 1,000 మంది బాలురకు 969 మంది బాలికలు

అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా DMHO కార్యాలయం నుంచి శనివారం ర్యాలీ నిర్వహించారు. DMHO జగదీశ్వరరావు ర్యాలీని ప్రారంభించారు. బాలురు, బాలికల నిష్పత్తి సమానంగా ఉండాలని ఆయన సూచించారు. విశాఖ జిల్లాలో ప్రతి 1,000 మంది బాలురకు 969 మంది బాలికలు ఉన్నారని, ఈ నిష్పత్తి సమానంగా ఉండేలా చూడాలని ఆరోగ్య సిబ్బందిని ఆదేశించారు. ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ కేంద్రాలన్నీ లింగ నిర్దారణ పరీక్షలు చేయకూడదన్నారు.
News October 11, 2025
వీఎంఆర్డీఏ కమిషనర్ బదిలీపై చర్చ!

VMRDA 2047 మాస్టర్ ప్లాన్‌తో విశాఖ నగర విస్తృత అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తుతోంది. ఈ తరుణంలో రెవెన్యూ అంశాలపై మంచి పట్టున్న VMRDA కమిషనర్ విశ్వనాథన్ బదిలీపై చర్చ నడుస్తోంది. అధికార వర్గాల నుంచి వస్తున్న వినతులు, అభ్యంతరాలను కమిషనర్ సీరియస్‌గా తీసుకోకపోవడం, ముక్కుసూటితనంగా ఉండటంతో ఆయనను బదిలీ చేయించారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాగా అమరావతిలో I&PR డైరెక్టర్‌గా ఆయన బదిలీ అయ్యారు.
News October 11, 2025
విశాఖ నుంచి బయలుదేరే పలు రైళ్లు రద్దు

పూండి రైల్వే స్టేషన్‌లో ఇంటర్ లాకింగ్ సిస్టం పనుల కారణంగా విశాఖ నుంచి బయలుదేరే పలు రైళ్లను రద్దు చేసినట్లు వాల్తేర్ డివిజన్ డీసీఎం పవన్ శుక్రవారం తెలిపారు. విశాఖ – బరంపూర్ ఎక్స్‌ప్రెస్ (18526), విశాఖ – భువనేశ్వర్ ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ (22820), విశాఖ – బరంపూర్ ప్యాసింజర్ (58532ను) అక్టోబర్ 13న రద్దు చేసినట్లు పేర్కొన్నారు. తిరుగు ప్రయాణంలో ఇవే రైళ్లు అక్టోబర్ 14న రద్దు చేసినట్లు వెల్లడించారు.