News December 24, 2025
GVMC కార్పొరేటర్ల పార్టీ ఫిరాయింపులపై కోర్టుకు

విశాఖలో మరోసారి నో-కాన్ఫిడెన్స్ రాజకీయాలు వేడెక్కాయి. GVMCలో అసమ్మతి కార్పొరేటర్లపై అనర్హత వేటు కోరుతూ YCP దాఖలు చేసిన పిటిషన్‌ను ఎన్నికల అధికారి తోసిపుచ్చారు. 26 మందికి నోటీసులు ఇచ్చినా.. ఒక్క సభ్యురాలు మాత్రమే విప్ ఉల్లంఘన పరిధిలోకి వస్తారని ప్రకటించారు. ఈ నిర్ణయంపై ప్రభుత్వ ఒత్తిళ్లు ఉన్నాయంటూ YCP ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించనుంది. కాగా.. వచ్చే ఏడాది మార్చితో పాలక మండలి గడువు ముగియనుంది.
Similar News
News January 11, 2026
ఇదేనా పవన్ కళ్యాణ్ ఆదివాసీలను ఆదుకునే తీరు: వైసీపీ

గోపాలరాయుడుపేట పంచాయతీలోని ఐదు గిరిజన గ్రామాల ప్రజలను ట్రైబల్ అధికారులు పట్టించుకోవడం లేదని వైసీపీ విమర్శించింది. సుమారు 100 కుటుంబాలు సమస్యలతో బాధపడుతుండగా.. పవన్ కళ్యాణ్ ఫొటోలు పట్టుకొని మెడకు ఉరి తాళ్లు బిగించుకొని గిరిజనులు వినూత్న నిరసన చేపట్టడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని పేర్కొంది. ‘ఇదేనా పవన్ కళ్యాణ్ ఆదివాసీలను ఆదుకునే తీరు?’ అంటూ వైసీపీ ట్వీట్ చేసింది.
News January 11, 2026
KNR: మార్కెట్‌లో సంక్రాంతి ముగ్గుల రంగులకు గిరాకీ!

సంక్రాంతి పండుగ వేళ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రంగుల విక్రయాలు జోరందుకున్నాయి. కొత్త డిజైన్ల కోసం మహిళలు ఆసక్తి చూపుతుండటంతో మార్కెట్లలో రంగులకు డిమాండ్ పెరిగింది. లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి, చెడును తొలగించడానికి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేయడం ఆనవాయితీ. భోగి, సంక్రాంతి, కనుమ రోజుల్లో గొబ్బెమ్మలతో అలంకరించిన ముగ్గులు సంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తాయి.
News January 11, 2026
సంక్రాంతి సందడి.. హోటళ్లు హౌస్‌ఫుల్

AP: గోదావరి జిల్లాల్లో సందడి సంక్రాంతి మొదలైంది. భీమవరం, ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు, కాకినాడ, రాజమండ్రి వంటి ప్రాంతాల్లో హోటళ్లు, లాడ్జిలు హౌస్‌ఫుల్ అయిపోయాయి. కోడిపందేల కోసం తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి జనం తరలివస్తున్నారు. పందేల బరులు భారీగా ఏర్పాటు చేస్తున్నారు. హోటల్ యజమానులు గదుల అద్దెను మూడు రోజులకు రూ.30-60 వేలు వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది.


