News December 24, 2025

తిరుపతి: 7 గవర్నమెంట్ ఉద్యోగాలు వద్దనుకుని..!

image

అన్నమయ్య జిల్లా కలకడకు చెందిన రాజా పవన్ కుమార్ 7ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. వాటికి సంతృప్తి చెందక SIగా సెటిలయ్యారు. 2022లో B.Tech పాసయ్యాడు. ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ హవల్దారుగా ఉద్యోగం సాధించారు. 2023లో రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో జూ.అసిస్టెంట్‌గా కొంతకాలం పనిచేశారు. ఎస్ఐ నోటిఫికేషన్ రావడంతో అహర్నిశలు కష్టపడి పీఎస్ఐగా ట్రైనింగ్ పూర్తి చేసి తిరుపతి జిల్లా భాకరాపేట SIగా చేరారు.

Similar News

News January 14, 2026

‘మన మిత్ర’తో వాట్సాప్‌లోనే పోలీస్ సేవలు: ఎస్పీ

image

గుంటూరు జిల్లాలో ‘మన మిత్ర-వాట్సాప్ గవర్నెన్స్’ ద్వారా సులభంగా పోలీస్ సేవలు పొందవచ్చని ఎస్పీ వకుల్ జిందాల్ బుధవారం తెలిపారు. ఇకపై ఎఫ్‌ఐఆర్ కాపీ, స్టేటస్, ఈ-చలానా వివరాల కోసం స్టేషన్‌కు వెళ్లాల్సిన పనిలేదు. 95523 00009 నంబర్‌కు వాట్సాప్‌లో ‘Hi’ అని మెసేజ్ చేస్తే చాలు. మెనూలో పోలీస్ సేవలను ఎంచుకుని వివరాలు పొందవచ్చు. ప్రజలు ఈ సదుపాయాన్ని వాడుకోవాలని ఎస్పీ కోరారు.

News January 14, 2026

విజయ్ మాతో పొత్తు పెట్టుకో.. బీజేపీ ఆఫర్

image

తమిళనాడులో తమతో పొత్తు పెట్టుకోవాలని TVK పార్టీని బీజేపీ ఆహ్వానించింది. వచ్చే ఎన్నికల్లో DMK గెలిచే అవకాశమే లేదని, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను ఏకం చేయాల్సిన అవసరం ఉందని BJP నేత అన్నామలై అన్నారు. డీఎంకే వ్యతిరేక పార్టీలన్నీ కలవాల్సిన అవసరం ఉందని మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. కాగా బీజేపీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని అంతకుముందు TVK డిప్యూటీ జనరల్ సెక్రటరీ నిర్మల్ కుమార్ తేల్చి చెప్పారు.

News January 14, 2026

బాపట్లలో రాష్ట్రస్థాయి ఎడ్ల ప్రదర్శన

image

సంక్రాంతి సందర్భంగా బాపట్లలో 16వ రాష్ట్రస్థాయి ఎడ్ల ప్రదర్శన బుధవారం ప్రారంభమైంది. బీమావారిపాలెం రామాలయం కమిటీ ఆధ్వర్యంలో మున్నంవారిపాలెం రోడ్డులో ఈ ప్రదర్శన ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్, డీఎస్పీ రామాంజనేయులు పోటీలను ప్రారంభించారు. పండగ పూట నిర్వహించిన ఈ ప్రదర్శనను తిలకించేందుకు జనం ఆసక్తి చూపారు.