News December 24, 2025
పంట రుణాల నిర్ణయంలో రైతులకు భాగస్వామ్యం: కలెక్టర్

జిల్లాలో వ్యవసాయ, అనుబంధ రంగాల రైతాంగానికి పంట రుణాల మంజూరు ఆర్ధిక స్థాయిని నిర్ణయించే సమయంలో రైతులను కూడా భాగస్వాములను చేయాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్‌లోని గౌతమీ సమావేశపు హాలులో బుధవారం వ్యవసాయ అనుబంధ రంగాల పంట రుణాల నిర్ణయంపై సంబంధిత శాఖల అధికారులు, బ్యాంకర్లతో కలెక్టర్ సమీక్షించారు. కౌలు రైతుకు రుణాలు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
Similar News
News December 29, 2025
పోలవరం జిల్లా జనాభా భౌగోళిక విస్తీర్ణం

రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పడిన విషయం తెలిసిందే. జనవరి ఒకటో తేదీ నుంచి కొత్త జిల్లాలు అమలులోకి రానున్నట్లు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. పోలవరం జిల్లాలో జనాభా 3,49,000, 12 మండలాలు, 178 గ్రామ పంచాయతీలు, 140 గ్రామ సచివాలయాలు, 832 రెవెన్యూ గ్రామాలు ఉండనున్నాయి. పోలవరం జిల్లా భౌగోళిక విస్తీర్ణం 6431.63 sq కిలోమీటర్లగా ఉంది.
News December 29, 2025
నటి మాధవీలతపై కేసు నమోదు

నటి మాధవీలతపై HYDలోని సరూర్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. SMలో సాయిబాబాపై అభ్యంతరకరంగా పోస్టులు పెట్టారని మాధవీలతతో పాటు పలువురు యూట్యూబర్లపైనా కేసు పెట్టారు. వీరి పోస్టులు ప్రజల భావోద్వేగాలను దెబ్బతీశాయని ఫిర్యాదు అందినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రేపు ఉదయం 10 గంటలకు పోలీస్ స్టేషన్‌కు హాజరు కావాలని ఆదేశించారు. అసత్య ప్రచారాలపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
News December 29, 2025
మండపేట ప్రజల కోరిక నెరవేర్చిన ప్రభుత్వం

మండపేట రాజమండ్రికి అతి సమీపంలో ఉంటుంది. కానీ జిల్లాల మార్పు సమయంలో 2003లో దీనిని బీఆర్ అంబేద్కర్ కోనసీమలో కలిపారు. అప్పటి నుంచి మండపేటను తిరిగి రాజమండ్రిలో కలపాలని ఒత్తిడి వస్తోంది. కూటమి ప్రభుత్వం ప్రజాభీష్టం పరిగణనలోకి తీసుకుంది. వారి అభిష్టానికి అనుగుణంగా మండపేటను రాజమండ్రిలో కలుపుతూ సోమవారం రాష్ట్ర క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. రెవిన్యూ మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు.


