News December 24, 2025

సీపీఐ శతవసంతాల ముగింపు సభను విజయవంతం చేయండి: చాడ

image

భారత కమ్యూనిస్టు పార్టీ శతవసంతాల ఉత్సవాలలో బాగంగా జనవరి 18న ఖమ్మం పట్టణంలో నిర్వహించే ముగింపు సభను విజయవంతం చేయాలని వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. కరీంనగర్‌లోని బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో బుధవారం విలేకర్లతో మాట్లాడారు. గడిచిన వందేళ్లలో పేదల పక్షాన నిలబడి ఎన్నో ప్రజా పోరాటాలు నిర్వహించిన కమ్యూనిస్టు పార్టీ వందేళ్ల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుందన్నారు.

Similar News

News December 29, 2025

కరీంగనర్ జిల్లాలో 4 మున్సిపాలిటీలు.. వివరాలివే!

image

జిల్లాలోని మున్సిపాలిటీలకు సంబంధించిన వార్డు, జనాభా వివరాలను అధికారులు విడుదల చేశారు. 2011 జనగణన ప్రకారం కరీంనగర్ మున్సిపాలిటీ పరిధిలో 66 వార్డులు, 328870 మంది జనాభా, ST-5999, SC-36902 మంది ఉన్నారు. కాగా, చొప్పదండిలో 14 వార్డులు, 16459 మంది జనాభా కాగా.. ST 205, ఎస్సీ 3062, హుజురాబాద్‌లో 30 వార్డులు, 34555 జనాభా, ST-309, SC-6326, జమ్మికుంటలో 30 వార్డులు, 39476 జనాభా ST 286, SC 7623గా ఉంది.

News December 29, 2025

KNR: కమిషనరేట్‌ విభాగాలను తనిఖీ చేసిన సీపీ

image

కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌లోని పలు విభాగాలను సీపీ గౌస్ ఆలం సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అడ్మిన్, మోటార్ ట్రాన్స్‌పోర్ట్, ఆయుధశాల, డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ బృందాల పని తీరును పరిశీలించారు. రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన ఆయన.. విధుల్లో అలసత్వం వహించవద్దని, క్రమశిక్షణతో పని చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆస్తులను బాధ్యతాయుతంగా కాపాడాలని సూచించారు.

News December 29, 2025

KNR: జనవరి 10న మున్సిపల్ తుది ఓటర్ జాబితా 

image

రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వార్డుల వారీగా ఓటర్ల జాబితాల తయారీకి రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. 2026 జనవరి 10న తుది జాబితాను ప్రకటించనున్నట్లు కమిషనర్ వెల్లడించారు. పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ల వివరాలను క్రోడీకరించి, పారదర్శకంగా జాబితాను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. రాజకీయ పార్టీల సూచనలు, ప్రజల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని ప్రక్రియ పూర్తి చేయనున్నారు.