News December 24, 2025
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో 3వ విడత VRSకి నోటిఫికేషన్

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో 3వ విడత VRS పథకాన్ని యాజమాన్యం బుధవారం ప్రకటించింది. 2027 జనవరి 1వ తేదీ తర్వాత పదవీ విరమణకు అర్హులయ్యే ఉద్యోగుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొంది. 2026 జనవరి 1-20 వరకు దరఖాస్తులను ఆన్‌లైన్‌లో మాత్రమే స్వీకరించనున్నట్లు స్పష్టం చేసింది. కనీసం 15 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసి, 45 ఏళ్లు దాటిన ఉద్యోగులు అర్హులు.
Similar News
News January 3, 2026
తెల్లవారుజామున ప్రయాణాలు చేయకండి: వరంగల్ సీపీ

వాతావరణంలో పొగమంచు తీవ్రత పెరగడంతో వీలైనంత వరకు వాహనదారులు రాత్రి, తెల్లవారుజామున ప్రయాణాలు చేయొద్దని వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ సూచించారు. దట్టమైన పొగమంచు కారణంగా రహదారులపై ఎదురుగా వచ్చే వాహనాలు, పాదాచారులను గుర్తించేందుకు వీక్షణ సామర్థ్యం తక్కువగా ఉంటుందన్నారు. ఈ సమయంలో చిన్నపాటి నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు దారితీసే అవకాశాలు ఉన్నందున, ప్రజలు ఈ సమయాల్లో ప్రయాణాలను మానుకోవాలన్నారు.
News January 3, 2026
గంజాయి తీసుకుంటూ దొరికిన BJP MLA కుమారుడు

TG: ఈగల్ టీమ్ తనిఖీల్లో BJP ఎమ్మెల్యే కుమారుడు పట్టుబడ్డారు. నానక్‌రామ్‌గూడలో నిర్వహించిన తనిఖీల్లో ఏపీ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి దొరికారు. తనిఖీల సమయంలో గంజాయి తీసుకుంటూ చిక్కిన ఆయనకు టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చింది. ఆయనను ఈగల్ టీమ్ డీఅడిక్షన్ సెంటర్‌కు తరలించింది.
News January 3, 2026
భీమరం: అంబరాన్ని అంటిన సంక్రాంతి సంబరాలు

సంస్కతీ సంప్రదాయాల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, కలెక్టర్ నాగరాణి అన్నారు. శనివారం భీమవరంలో సంక్రాంతి సంబరాలను డిప్యూటీ స్పీకర్, కలెక్టర్ భోగి మంటలు వేసి ప్రారంభించారు. బొమ్మలకొలువు, రంగవల్లులు, గొబ్బమ్మలు, భోగిమంట, హరిదాసులు, కోలాటం, సాంస్కతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.


