News December 24, 2025
రాయికల్ పెద్ద చెరువులో గుర్తుతెలియని శవం

రాయికల్ పట్టణం పెద్ద చెరువు సమీపంలోని తుమ్మకొలులో గుర్తుతెలియని యువకుడి శవం లభ్యం కావడంతో కలకలం రేగింది. మంగళవారం సాయంత్రం మత్స్యకారులు దీనిని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు టీ-షర్ట్ ధరించి ఉన్నాడని, చేతిపై పచ్చబొట్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News January 2, 2026
ఏడాదిలో 166 పులుల మృత్యువాత

2025లో దేశంలో 166 పులులు చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. టైగర్స్ స్టేట్‌గా పేరుపొందిన మధ్యప్రదేశ్‌లో 55, మహారాష్ట్రలో 38, కేరళలో 13, అస్సాంలో 12 మరణించాయి. పులుల సంరక్షణ అథారిటీ ప్రకారం 2024తో పోలిస్తే 40 డెత్స్ ఎక్కువగా నమోదయ్యాయి. ‘టైగర్స్ జనాభా సంతృప్తస్థాయికి చేరుకుంది. టెర్రిటరీల ఏర్పాటులో అవి ఇబ్బంది పడుతున్నాయి. ఈ క్రమంలో గొడవ పడి చనిపోతున్నాయి’ అని వన్యప్రాణి నిపుణుడు జైరాం శుక్లా తెలిపారు.
News January 2, 2026
చెల్లింపులన్నీ UPIలోనే.. ఏకంగా ₹300 లక్షల కోట్లు

UPI లావాదేవీలు రికార్డులు బ్రేక్ చేస్తున్నాయి. ఆన్‌లైన్ చెల్లింపుల్లో 85-90% వాటి ద్వారానే జరుగుతున్నాయి. డిసెంబర్‌లో ఏకంగా 21.6 బిలియన్ ట్రాన్సాక్షన్లు జరిగాయి. వాటి విలువ ₹27.97 లక్షల కోట్లు. UPI చరిత్రలో ఇదే అత్యధికం. సగటున రోజుకు 698 మిలియన్ల డిజిటల్ పేమెంట్లు నమోదయ్యాయి. గతేడాది మొత్తం 228.3B ట్రాన్సాక్షన్లు జరిగాయి. వాటి విలువ ₹299.7 లక్షల కోట్లు కావడం గమనార్హం. 2024 కంటే సుమారు 33% ఎక్కువ.
News January 2, 2026
ధనుర్మాసం: పద్దెనిమిదో రోజు కీర్తన

‘ఏనుగు వంటి బలమున్న నందగోపుని కోడలా! సుగంధభరిత కేశాలు కల నీళాదేవి! కోళ్లు కూస్తున్నాయి, కోకిలలు గానం చేస్తున్నాయి. నీవు కృష్ణుడితో సరస సంభాషణల్లో మునిగి మమ్మల్ని మరువకు. మీ మధ్య వాదన వస్తే మేము నీ పక్షమే వహిస్తాం. నీ గాజులు ఘల్లుమనేలా నడచి వచ్చి, నీ ఎర్రని తామరల వంటి చేతులతో తలుపులు తీయమ్మా!’ అని వేడుకుంటున్నారు. ఇక్కడ తలుపులు తీయడమంటే భక్తుడికి, భగవంతుడికి మధ్య అడ్డుతెరలను తొలగించడం! <<-se>>#DHANURMASAM<<>>


