News December 24, 2025
HYDలో కొత్తగా కల్చరల్ ట్రెండ్

HYDలో ఒక కొత్తగా కల్చరల్ ట్రెండ్ నడుస్తోంది. వర్క్ స్ట్రెస్ మధ్య నలిగిపోతున్న యువత ‘కళ’ల వైపు అడుగులు వేస్తోంది. క్లాసికల్ ఆర్ట్స్‌కు మోడ్రన్ టచ్ ఇచ్చే ‘ఫ్యూజన్’ ప్రయోగాలు కుర్రాళ్లకు తెగ నచ్చేస్తున్నాయి. భరతనాట్యాన్ని రాక్, జాజ్, సూఫీ మ్యూజిక్‌తో మిక్స్ చేస్తూ నైసీ జోసెఫ్ స్టూడియోస్ చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు సిటీలో హాట్ టాపిక్. ‘HYD.ART’ లాంటి ఇమ్మర్సివ్ వర్క్‌షాప్స్ యూత్ ఐకాన్లుగా మారాయి.
Similar News
News December 27, 2025
వరంగల్‌లో బయో గ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేయండి: ఎంపీ

వరంగల్ నగరంలో మున్సిపల్ వ్యర్థాల నిర్వహణ, పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి కోసం కంప్రెస్డ్ బయో గ్యాస్ (CBG) ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని ఎంపీ కడియం కావ్య కోరారు. ఆయిల్ ఇండియా లిమిటెడ్ చైర్మన్‌కు ఆమె లేఖ రాశారు. గ్రేటర్ వరంగల్ పరిధిలో రోజుకు 400 టన్నుల వ్యర్థాలు వస్తున్నాయని, పర్యావరణ పరిరక్షణకు ఈ ప్లాంట్ ఎంతో అవసరమన్నారు. దీనివల్ల కాలుష్యం తగ్గడమే కాక, స్వచ్ఛమైన ఇంధనం అందుబాటులోకి వస్తుందని ఆమె వివరించారు.
News December 27, 2025
భద్రాద్రి జిల్లాలో లొంగిపోయిన 300 మంది మావోయిస్టులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో 2025 సంవత్సరపు వార్షిక నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది జిల్లాలో నలుగురు మావోయిస్టులను అరెస్టు చేయగా, మరో 300 మంది లొంగిపోయినట్లు వెల్లడించారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు సమర్థవంతంగా పనిచేశారని, నేరాల నియంత్రణకు పటిష్ఠ చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ వివరించారు.
News December 27, 2025
అరకులోయలో VRO భార్య అనుమానాస్పద మృతి

అరకులోయలోని సి.కాలనీలో నివాసముంటున్న వాలసి VRO కొండలరావు రెండో భార్య రత్నలమ్మ(45) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. శనివారం ఆమె తన నివాసంలో విగతజీవిగా పడి ఉండటాన్ని మృతురాలి కుమారుడు బాలకృష్ణ గుర్తించారు. వెంటనే అరకులోయ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై వేణుగోపాల్ రావు మృతదేహాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు.


