News April 24, 2024

10th ఫలితాల్లో సత్తాచాటిన ప్రకాశం జిల్లా

image

టెన్త్ ఫలితాల్లో ప్రకాశం జిల్లా 91.21% ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 7 స్థానంలో నిలిచింది. 29,195 మందికి గానూ 26,630 మంది పాసయ్యారు. 14,511 మంది బాలికలకు 13,422 మంది, బాలురు 14,684 మందికి 13,208 మంది పాసయ్యారు. బాలులతో పోలీస్తే బాలికలు ఈసారి సత్తా చాటారు. కాగా 2023లో 73.74% ఉత్తీర్ణత సాధించారు. అటు బాపట్ల జిల్లాలో 16,718 మందికి గానూ 14,743 మంది పాసయ్యారు. 88.19శాతం ఉత్తీర్ణతతో 14వ స్థానంలో నిలిచింది.

Similar News

News October 11, 2025

ఒంగోలు నుంచి పాకల బీచ్‌కు ఫ్రీ బస్సు

image

ఒంగోలు డిపో నుంచి ప్రతి ఆదివారం పాకల బీచ్‌కి స్త్రీ శక్తి పథకం వర్తించే బస్సులు ప్రత్యేకంగా నడపనున్నట్లు ఒంగోలు RTC డిపో మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు. ప్రజలు, యాత్రికులు ఈ సర్వీస్‌ని ఉపయోగించుకోవాల్సిందిగా ఆయన శనివారం ప్రకటన విడుదల చేశారు. ప్రతి ఆదివారం పాకల బీచ్‌కు వచ్చే సందర్శకులకు ఇదొక మంచి సదవకాశంగా చెప్పవచ్చు.

News October 11, 2025

ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ వద్ద పోలీసుల తనిఖీలు

image

ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ వద్ద శనివారం పోలీస్ అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు.. శాంతి భద్రతల పరిరక్షణ చర్యలలో భాగంగా పోలీస్ డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగి అణువణువు తనిఖీ నిర్వహించాయి. అలాగే సమీప లాడ్జీలను సైతం తనిఖీ చేసి అనుమానిత వ్యక్తుల వివరాలు ఆరా తీశారు. కాగా జిల్లా వ్యాప్తంగా పోలీసులు గత కొద్దిరోజులుగా తనిఖీ చేస్తున్న విషయం తెలిసిందే.

News October 11, 2025

హత్య కేసులో ముద్దాయికి యావజ్జీవ శిక్ష

image

కొండపి వైన్ షాప్ దగ్గర వాచ్మెన్‌గా పనిచేస్తున్న ముక్కోటిపాలెం గ్రామంకు చెందిన సుబ్బారెడ్డి అనే యువకుడ్ని 2023 ఏప్రిల్ నెలలో హత్య చేశారు. కాగా సీఐ సోమశేఖర్ ఆధ్వర్యంలో కేసు ట్రైల్స్‌ని సమర్థవంతంగా నిర్వహించారు. శుక్రవారం ముద్దాయి హనుమంతరావుకి కోర్టులో యావజీవ శిక్ష ఖరారు చేసినట్లు సీఐ సోమశేఖర్ తెలిపారు. ఈ కేసులో సమర్థవంతంగా వ్యవహరించిన సీఐ సోమశేఖర్, ఎస్సై ప్రేమ్కుమార్‌ను అధికారులు అభినందిచారు.