News December 25, 2025

వేగంగా పనులు చేయండి: అన్నమయ్య కలెక్టర్

image

రహదారుల పనులు వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు ప్రయాణ ఖర్చు తగ్గేలా చూడాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. రాయచోటి కలెక్టరేట్‌లో వివిధ ఇంజినీరింగ్ శాఖల పనుల పురోగతిపై సమీక్షించారు. గ్రామీణ రహదారులను మండల, జిల్లా రహదారులకు అనుసంధానం చేయాలన్నారు. జలజీవన్ మిషన్, వాటర్ గ్రిడ్, R&B, నీటిపారుదల, జాతీయ రహదారుల పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

Similar News

News December 30, 2025

శుభ సమయం (30-12-2025) మంగళవారం

image

➤ తిథి: శుక్ల ఏకాదశి రా.1.27 వరకు
➤ నక్షత్రం: భరణి రా.1.14 వరకు
➤ శుభ సమయాలు: ఏమి లేవు.
➤ రాహుకాలం: మ.3.00 నుంచి 4.30 వరకు
➤ యమగండం: 9.00 AM నుంచి 10.30 AM
➤ దుర్ముహూర్తం: ఉ.8.24 నుంచి 9.12 వరకు, రా.10.48 నుంచి 11.36 వరకు
➤ వర్జ్యం: ఉ.11.46 నుంచి మ.1.16 వరకు
➤ అమృత ఘడియలు: రా.9.08 నుంచి 10.38 వరకు.

News December 30, 2025

డబ్బులు వసూలు చేసి తెస్తుండగా ప్రమాదం

image

ఎలమంచిలి వద్ద ఆదివారం అర్ధరాత్రి
ఎర్నాకులం ఎక్స్ ప్రెస్ రైలులో రెండు భోగీలు కాలిపోవడంతో విజయవాడకు చెందిన చంద్రశేఖర్ సుందర్ అనే వృద్ధుడు (70) మరణించిన సంగతి తెలిసిందే. అతని వద్ద ఉన్న బ్యాగులో రూ.6 లక్షల వరకు నగదు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇతను హోల్ సేల్ వస్త్ర వ్యాపారని విజయనగరం నుంచి డబ్బులు వసూలు చేసుకుని తెస్తుండగా ప్రమాదం జరిగినట్లు తుని ప్రభుత్వ రైల్వే ఎస్సై శ్రీనివాసరావు చెప్పారు.