News April 24, 2024
MBNR: ఎండలు పెరుగుతున్నాయ్.. జాగ్రత్త !

మహబూబ్ నగర్ జిల్లాలోని అడ్డాకులలో ఆదివారం అత్యధికంగా 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. బాలానగర్లో 42.7, కోయిలకొండలో 42.3, మూసాపేటలో 42.2, మిడ్జిల్లో 41.9, మహబూబ్ నగర్లో 41.5, జడ్చర్లలో 41.3 డిగ్రీలు నమోదు కాగా, నవాబ్ పేటలో అత్యల్పంగా 39.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జిల్లా వ్యాప్తంగా ఎండ తీవ్రతతోపాటు వడగాలులు వీస్తున్నాయి. దీంతో వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు పాటించాలని వైద్యులు చెబుతున్నారు.
Similar News
News March 23, 2026
పాలమూరు: రైతులు ALERT.. 2 రోజులే ఛాన్స్.!

‘రైతుభరోసా’ పథకం డబ్బులు పొందాలంటే మార్చి 25 వరకు దరఖాస్తులు చేసుకోవాలని పెద్దవార్వాల్ ఏఈఓ శివలీల ‘Way2News’ ప్రతినిధితో తెలిపారు. ఫిబ్రవరి 28 వరకు కొత్తగా పట్టాదారు పాస్ బుక్ పొందిన రైతులు, ఇప్పటి వరకు రైతుభరోసా పొందని, బ్యాంక్ వివరాలు నమోదు చేయని వారు అప్లై చేసుకోవాలని, అప్లికేషన్ ఫామ్‌తో పాటు పాస్ బుక్, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ బుక్ జిరాక్స్, మొబైల్ నంబర్ వివరాలు సమర్పించాలన్నారు. SHARE IT.

News March 22, 2026
కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: డీకే అరుణ

మహబూబ్‌నగర్ ఎంపీ క్యాంపు కార్యాలయంలో వివిధ చేతివృత్తుల కుల సంఘాలతో ఎంపీ డీకే అరుణ శనివారం సమావేశమయ్యారు. విశ్వకర్మ, గొల్ల కురుమ, ఇతర బీసీ కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. వారికి కేంద్ర ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ సూచించారు. స్వర్ణకారులకు రుణ సదుపాయాల కల్పనతో పాటు, వారి విజ్ఞప్తులను కేంద్రం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు.