News December 25, 2025
కొనుగోలు చేసిన ప్రతి వస్తువుకు బిల్లు తప్పనిసరిగా పొందాలి: జేసీ

కొనుగోలు చేసిన ప్రతి వస్తువుకు బిల్లు తప్పనిసరిగా పొందాలని జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు తెలిపారు. నేటి ఆధునిక, సాంకేతిక యుగంలో వినియోగదారులకు తమ హక్కుల గురించి అవగాహన ఎంతో ముఖ్యమని జాయింట్ కలెక్టర్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. జాతీయ వినియోగదారుల దినోత్సవానికి “డిజిటల్ న్యాయపాలన ద్వారా సమర్థ, సత్వర పరిష్కారం” అనే ఇతివృత్తాన్ని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
Similar News
News December 29, 2025
శుభవార్త: దగదర్తి ఎయిర్ పోర్ట్‌కు గ్రీన్ సిగ్నల్

జిల్లా వాసుల చిరకాల కోరిక దగదర్తి విమానాశ్రయం ఏర్పాటుకు ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. విమానాశ్రయం భూసేకరణకు సంబంధించిన సమగ్ర నివేదికను కలెక్టర్ హిమాన్షు శుక్లా రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారు. సోమవారం అమరావతిలో ఈ నివేదికను క్యాబినెట్ ఆమోదించింది. దీంతో త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి.
News December 29, 2025
నెల్లూరు నుంచి 2 మండలాలు ఔట్.!

<<18703339>>నెల్లూరు<<>> జిల్లాలో ఇక నుంచి 36 మండలాలు ఉండనున్నాయి. ఇది వరకు 38 ఉండేవి. కందుకూరు నియోజకవర్గం (5 మండలాలు)ను తిరిగి ప్రకాశం జిల్లాలో కలిపారు. మరోవైపు గూడూరు నియోజకవర్గంలోని 3 మండలాలు(గూడూరు, కోట చిల్లకూరు) మండలాలను తిరిగి నెల్లూరులో కలిపారు. దీంతో మొత్తం మీద జిల్లాలో మండలాల సంఖ్య 36కు చేరింది.
News December 29, 2025
నెల్లూరు జిల్లాలో గూడూరు.. ట్విస్ట్ ఇదే.!

గూడూరు నియోజకవర్గాన్ని తిరుపతి నుంచి మళ్లీ నెల్లూరు జిల్లాలో కలుపుతూ క్యాబినేట్ నిర్ణయం తీసుకుంది. అయితే గూడూరు, చిల్లకూరు, కోట మండలాలను మాత్రమే నెల్లూరులో కలిపారు. చిట్టమూరు, వాకాడు మండలాలు తిరుపతి జిల్లాలోనే కొనసాగనున్నాయి. వాకాడులో దుగరాజపట్నం పోర్ట్ కారణంగానే ఆ మండలాన్ని తిరుపతిలో కొనసాగించనున్నారు. చిట్టమూరు సైతం తిరుపతికి దగ్గరగా ఉంటుంది.


