News December 25, 2025

యలమంచిలి: తండ్రి క్షణికావేశం.. అనాథ అయిన చిన్నారి

image

క్షణికావేశంలో తండ్రి చేసిన తప్పుకు ఆ చిన్నారి అనాథ అయింది. బుధవారం యలమంచిలి పట్టణంలో <<18659799>>మాయ<<>> అనే వివాహితను భర్త రాకేశ్ కిరాతంగా చంపాడు. వీరికి 4 నెలల చిన్నారి ఉంది. తల్లి (మాయ) మృతి.. తండ్రి (రాకేశ్) కటకటాలపాలయ్యాడు. దీంతో అనాథగా మారిన ఆ చిన్నారిని అధికారులు స్త్రీ శిశు సంక్షేమ శాఖ చైల్డ్ వెల్ఫేర్ జిల్లా అధికారులకు అప్పగించారు.

Similar News

News December 29, 2025

2025 రివైండ్… గుంటూరు జిల్లాలో పాజిటివ్ న్యూస్

image

గుంటూరు జిల్లాకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కలిపి సుమారు రూ.955 కోట్ల విలువైన మౌలిక వసతుల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపాయి. రియల్‌ ఎస్టేట్ రంగంలో గుంటూరు దేశంలోనే వేగంగా ఎదుగుతున్న టియర్-2 నగరంగా నిలిచి, భూమి ధరలు 51 శాతం పెరిగాయి. ప్రజారోగ్య రంగంలో భాగంగా ప్రత్తిపాడులో రూ.150 కోట్లతో 100 పడకల ఈఎస్‌ఐ ఆసుపత్రి మంజూరైంది. అలాగే గుంటూరు కాలువ ఆధునీకరణకు రూ.400 కోట్లు కేటాయించారు.

News December 29, 2025

నేటి నుంచి అసెంబ్లీ.. భద్రాచలం MLA ఎటువైపు..!

image

అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి జిల్లాకు చెందిన 10మంది ఎమ్మెల్యేల్లో తొమ్మిది మంది కాంగ్రెస్‌ నుంచే ఉండగా.. జిల్లా సమస్యలపై సభలో చర్చ జరుగుతుందని ప్రజలు ఆశిస్తున్నారు. అటు భద్రాచలం MLA తెల్లం వెంకటరావు పార్టీ ఫిరాయింపుపై కేసు నడుస్తున్న నేపథ్యంలో ఆయన ఏ పక్షాన కూర్చుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఈసారి సమావేశాల్లో కొన్ని సమస్యల పరిష్కారం ఉంటుందని ప్రజలు ఎదురుచూస్తున్నారు.

News December 29, 2025

నిర్మల్: నీటిలోకి తోసేసి చంపేశారు

image

నిర్మల్ జిల్లాలో గల్లంతైన సారంగాపూర్ మం. లింగాపూర్‌ వాసి కార్తీక్ మృతదేహం ఆదివారం లభ్యమైంది. ఈనెల 25న మేనబావ గంగాప్రసాద్ మరో మైనర్‌‌తో బయటివెళ్లిన కార్తీక్ శవమయ్యాడు. తనకు ఈత రాదని చెప్పినా వినిపించుకోకుండా మద్యం మత్తులో ఉన్న మేనబావ, బాలుడు నీటిలోకి తోసేయడంతో మృతిచెందాడు. గజఈతగాళ్ల సాయంతో మృతదేహాన్ని బయటికి తీశామని, నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.