News December 25, 2025
నేడు సంసద్ ఖేల్ మహోత్సవ్ ముగింపు వేడుకలు

జిల్లా సంసద్ ఖేల్ మహోత్సవ్-2025 ముగింపు ఉత్సవాలు గురువారం ఘనంగా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు. ఆనం కళాకేంద్రంలో మండల, జిల్లా స్థాయి క్రీడా పోటీలు, మారథాన్ ముగిసిన అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేయనున్నారు. ఎంపీ దగ్గుబాటి పురందరేశ్వరి ముఖ్య అతిథిగా హాజరై బహుమతులు అందజేస్తారని వెల్లడించారు. ఈ ఉత్సవాల్లో భారీ సంఖ్యలో యువత పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.
Similar News
News January 2, 2026
జిల్లాలో విస్తారంగా పొగాకు సాగు!

గత సీజన్‌లో లాభాలు పండటంతో జిల్లాలో వర్జీనియా పొగాకు సాగు జోరుగా సాగుతోంది. గోపాలపురం వేలం కేంద్రం పరిధిలో 3,020 హెక్టార్లు, దేవరపల్లి పరిధిలో 4,566 హెక్టార్లలో రైతులు నాట్లు వేశారు. రెండు కేంద్రాల పరిధిలో సుమారు 3,461 మంది రైతులు 4,039 బ్యారెన్ల ద్వారా సాగు చేస్తున్నారు. మొత్తం సాగులో 30 శాతానికి పైగా వర్జీనియా పొగాకు ఇక్కడే ఉండటం విశేషం.
News January 2, 2026
వంతెనపై బైక్.. గోదావరిలో శవమై తేలిన వేములూరు వాసి!

ఐదు రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠ విషాదాంతమైంది. కొవ్వూరు మండలం వేములూరుకు చెందిన గేల్లా గోవిందప్రసాద్(38) మృతదేహం గోదావరి నదిలో లభ్యమైంది. డిసెంబరు 30న ఇంటి నుంచి వెళ్లిన ఆయన.. తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 31న రోడ్డు కం రైలు వంతెనపై బైకును గుర్తించిన పోలీసులు గాలింపు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
News January 2, 2026
తూర్పు గోదావరిలో వరి సేకరణ వేగవంతం: జేసీ

తూర్పు గోదావరి జిల్లాలో ఖరీఫ్ వరి సేకరణ ప్రక్రియ విజయవంతంగా సాగుతోందని జేసీ వై. మేఘా స్వరూప్ గురువారం తెలిపారు. జనవరి 1, 2026 నాటికి పీపీసీల ద్వారా 3.67 లక్షల మెట్రిక్ టన్నుల వరిని సేకరించినట్లు వెల్లడించారు. ఇప్పటివరకు 47,426 మంది రైతులు ధాన్యం విక్రయించారు. ఈ సీజన్‌లో 4 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని జేసీ అన్నారు.


