News December 25, 2025
SSCలో స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు

SSCలో 326 గ్రేడ్-C స్టెనోగ్రాఫర్(LDCE) ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజైంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, హిందీ/ఇంగ్లిష్‌లో షార్ట్ హ్యాండ్ స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. CBTలో అర్హత మార్కులు సాధించిన అభ్యర్థులకు స్టెనోగ్రఫీ టెస్ట్ నిర్వహిస్తారు. వచ్చే నెల 11వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. విభాగాల వారీగా ఖాళీలు, అర్హత, అప్లికేషన్, నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం ఇక్కడ <
Similar News
News December 28, 2025
టీ20ల్లో హయ్యెస్ట్ స్కోర్.. ఉమెన్స్ టీమ్ రికార్డ్

శ్రీలంక ఉమెన్స్ జట్టుతో జరుగుతున్న 4వ టీ20లో టీమ్ ఇండియా 221 రన్స్ చేసి సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. అంతర్జాతీయ T20 మ్యాచుల్లో మనకు ఇదే అత్యధిక స్కోర్ కావడం విశేషం. భారత్ 2024లో వెస్టిండీస్‌పై 217/4, ఈ ఏడాది నాటింగ్‌హామ్ వేదికగా ఇంగ్లండ్‌పై 210/5 రన్స్ చేసింది. అటు ఈ మ్యాచ్‌లో స్మృతి మంధాన-షెఫాలీ వర్మ కలిసి హయ్యెస్ట్ ఫస్ట్ వికెట్ పార్ట్‌నర్‌షిప్(162 రన్స్) నమోదు చేశారు.
News December 28, 2025
OpenAI సూపర్ ఆఫర్.. రూ.4.6 కోట్ల జీతం

OpenAI భారీ జీతంతో ఓ జాబ్ ఆఫర్ ప్రకటించింది. ‘హెడ్ ఆఫ్ ప్రిపేర్డ్‌నెస్’ అనే కీలక రోల్‌కు ఏటా 5.55 లక్షల డాలర్ల (సుమారు రూ.4.6 కోట్లు) జీతం ఇవ్వనున్నట్లు ఆ సంస్థ CEO సామ్ ఆల్ట్‌మన్ ప్రకటించారు. దీనికి సెలక్ట్ అయితే కొత్త AI మోడల్స్ వల్ల కలిగే సైబర్, భద్రతా ముప్పులను ముందే అంచనా వేసి నివారణ చర్యలను డిజైన్ చేయాలి. మెషిన్ లెర్నింగ్, AI సేఫ్టీ, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో ఎక్స్‌పీరియన్స్ ఉండాలి.
News December 28, 2025
ఇల్లు ఏ ఆకారంలో ఉండటం ఉత్తమం?

ఇల్లు చతురస్రం లేదా దీర్ఘ చతురస్ర ఆకారాల్లో ఉండటం ఉత్తమమని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ‘ఈ ఆకారాలు ఇంట్లో శక్తిని సమతుల్యం చేస్తాయి. క్రమపద్ధతి లేకుండా మూలలు పెరగడం, తగ్గడం వంటి ఎగుడుదిగుడులు ఉండనివ్వవు. వంకరలు, అస్తవ్యస్తమైన ఆకృతులు ఉన్న ఇల్లు వాస్తు దోషాలకు దారితీసి అశాంతిని కలిగిస్తుంది. సరైన కొలతలతో కూడిన క్రమబద్ధమైన ఆకృతే యజమానికి శ్రేయస్సు చేకూరుస్తుంది’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>


