News December 25, 2025
సిద్దిపేట: గురుకుల పాఠశాలల్లో దరఖాస్తుల ఆహ్వానం

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సాంఘీక, గిరిజన, వెనుకబడిన సంక్షేమ శాఖలో, సాధారణ గురుకుల విద్యాలయాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను 5 నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాల కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలని సిద్దిపేట జిల్లా కో ఆర్డినేటర్ డా.శారద వెంకటేష్ తెలిపారు. జనవరి 21 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. సిద్దిపేటలో 8 బాలుర, 8 బాలికల పాఠశాలలు ఉన్నాయన్నారు.
Similar News
News December 28, 2025
గుంటూరు: నిరుద్యోగ యువతకు బంపర్ ఆఫర్..!

యూనియన్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉచిత నైపుణ్య శిక్షణ ఇస్తున్నట్లు డైరెక్టర్ సందీప్ తెలిపారు. 2026 JAN 16 నుంచి ఫోటోగ్రఫీ, వీడియో, 19 నుంచి కంప్యూటర్ ట్యాలీ, 29 నుంచి రిఫ్రిజరేషన్, AC సర్వీసింగ్‌లో నెల రోజులు శిక్షణ ఇవ్వనున్నారు. 10 ఆపై చదివిన గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లా యువత అర్హులన్నారు. మరిన్ని వివరాలకు 08632-336912, 97006 87696ను సంప్రదించాలని కోరారు.
News December 28, 2025
ట్రైలర్ ఏది ‘రాజాసాబ్’?

నిన్న ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ‘రాజాసాబ్’ రెండో ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తీరా చివరివరకు వెయిట్ చేసిన అభిమానులకు నిరాశే ఎదురైంది. ఈవెంట్ చివర్లో ట్రైలర్ రేపు వస్తుందని ప్రభాస్ అనౌన్స్ చేశారు. దీంతో ఇవాళ ఉదయం నుంచి వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్‌కు మళ్లీ ఎదురుచూపులే మిగిలాయి. ఇప్పటివరకు మేకర్స్ నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. దీంతో అభిమానులు నెట్టింట అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
News December 28, 2025
NZB: గ్రామాలకు సర్పంచ్‌లే CM: MP

గ్రామాలకు సర్పంచ్ లే CMలని వారికి సర్వాధికారాలు ఉన్నాయని MP అర్వింద్ ధర్మపురి అన్నారు. GP ఎన్నికల్లో సర్పంచ్లుగా గెలిచిన బీజేపీ మద్దతుదారులకు NZB నగర శివారులోని ఓ ఫంక్షన్ హాల్లో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో 96 మంది బీజేపీ సర్పంచ్లు గెలవడం అద్భుతమన్నారు. వచ్చేసారి 98 శాతం పంచాయతీల్లో బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.


