News December 25, 2025

వర్గపోరుపై మంత్రి వివేక్ కీలక వ్యాఖ్యలు

image

సిద్ధిపేట జిల్లా కాంగ్రెస్‌ పార్టీలో వర్గపోరుపై మంత్రి వివేక్ వెంకటస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో గ్రూపుల గోలను పక్కన పెట్టాలని విజ్ఞప్తి చేశారు. వర్గపోరు కాంగ్రెస్‌కు నష్టం, బీఆర్ఎస్‌కు లాభమని హెచ్చరించారు. హరీష్ రావు పదేళ్ల మంత్రిగా ఉండి నిధులన్నీ సిద్దిపేటకు ఇచ్చారని, దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధిలో వెనుకబడిందని పేర్కొన్నారు. దుబ్బాక అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి వివేక్ చెప్పారు.

Similar News

News December 28, 2025

‘మేకిన్ మల్కాపూర్’ 380 వారాలుగా స్వచ్ఛభారత్

image

మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలోని ఆదర్శ గ్రామమైన మల్కాపూర్‌లో 380 వారాలుగా స్వచ్ఛభారత్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ‘మేకిన్ మల్కాపూర్’ నినాదంతో యువత గ్రామాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించనున్న గ్రామంగా ఎంపిక కావడంతో గ్రామస్థులు మరింత శ్రమిస్తున్నారు. సర్పంచ్ ఆంజనేయులు గౌడ్, పంచాయతీ ప్రతినిధులు, అధికారులు కలిసి శుభ్రత పనులను చేపట్టారు.

News December 28, 2025

పార్లమెంట్ ప్రోగ్రాంలో పాల్గొన్న మెదక్ విద్యార్ధి

image

పార్లమెంట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మెదక్ జిల్లా విద్యార్ధి పాల్గొన్నారు. కేంద్ర విద్యా శాఖ(NCERT) ఢిల్లీచే ఎంపిక చేసి పార్లమెంటు కార్యక్రమంలో పాల్గొనడానికి పాపన్నపేట మండలం లింగాయపల్లి చీకోడ్ విద్యార్థి ఏ.శివ చైతన్య, ఉపాధ్యాయుడు ఆర్.కిషన్ ప్రసాద్‌ను ఆహ్వానించారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ప్రసంగించగా లోక్ సభ స్పీకర్ ఓం బిర్ల.. విద్యార్థి, ఉపాధ్యాయుడిని అభినందించారు.

News December 28, 2025

RMPT: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

image

రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న యువకుడు శనివారం కన్నుమూశాడు. మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. RMPT మండలంలోని ఆర్.వెంకటాపూర్ గ్రామానికి చెందిన గుర్రం తేజ గౌడ్ మూడు నెలల క్రితం కర్నాల్‌పల్లి వద్ద జరిగిన ప్రమాదంలో తలకి తీవ్ర గాయాలై కోమాలోకి వెళ్ళాడు. అప్పటి నుంచి ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతుండగా శనివారం పరిస్థితి విషమించి మృతి చెందాడు.