News December 25, 2025

నేటితో ముగియనున్న సుపరిపాలన యాత్ర

image

AP: మాజీ PM వాజ్‌ పేయి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో చేపట్టిన అటల్-మోదీ సుపరిపాలన యాత్ర నేటితో ముగియనుంది. ఈ నెల 11న ధర్మవరంలో ప్రారంభమైన యాత్రను రాజధాని అమరావతిలో ముగించనున్నారు. ఈ సందర్భంగా అమరావతిలోని అటల్ స్మృతివనంలో 11amకు అటల్ కాంస్య విగ్రహాన్ని CM CBN ఆవిష్కరిస్తారు. BJP ముఖ్యనేతలు హాజరుకానున్నారు. స్మృతివనానికి N4, E4 రోడ్డు జంక్షన్‌లో 2.33ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది.

Similar News

News January 12, 2026

బెర్క్‌షైర్ హాత్‌వే కొత్త CEOకి భారీ వేతనం

image

వారెన్ బఫెట్ <<18720997>>పదవీ విరమణ<<>> అనంతరం బెర్క్‌షైర్ హాత్‌వే కొత్త CEOగా గ్రెగ్ అబెల్ బాధ్యతలు చేపట్టారు. 2026 సంవత్సరానికి ఆయన వార్షిక వేతనం 25 మిలియన్ డాలర్లు (సుమారు రూ.208 కోట్లు)గా నిర్ణయించారు. ఇది గతంతో పోలిస్తే 19 శాతం ఎక్కువ కావడం విశేషం. బఫెట్ కంటే ఎక్కువ వేతనం పొందడం చర్చనీయాంశంగా మారింది. వైస్ ఛైర్మన్‌గా సేవలందించిన అబెల్, ఇప్పుడు బెర్క్‌షైర్‌లో కీలక బాధ్యతలు చేపట్టారు.

News January 12, 2026

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News January 12, 2026

డింపుల్ హయాతి దాసరి మనవరాలని తెలుసా?

image

డింపుల్ హయాతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తాను డైరెక్టర్ దాసరి నారాయణరావు మనవరాలినని వెల్లడించారు. రవితేజతో కలిసి నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మూవీ ప్రమోషన్స్‌లో ఈ విషయం చెప్పారు. ‘దాసరి నారాయణరావు గారు మా తాతకు కజిన్. మా నానమ్మ ప్రభ కిక్ మూవీలో హీరో తల్లిగా చేశారు. నన్ను ఇలియానాకు చెల్లిగా చేయమన్నారు. అప్పుడు నేను ఫోర్త్ క్లాస్. అందుకే పేరెంట్స్ వద్దన్నారు. తర్వాత చాలా ఫీలయ్యారు’ అని తెలిపారు.