News December 25, 2025

సూర్యాపేట: 2025 రిపోర్ట్.. తగ్గిన నేరాలు

image

పోలీస్ శాఖ వార్షిక నివేదిక-2025ను ఎస్పీ నరసింహ విడుదల చేశారు. గతేడాదితో పోల్చుకుంటే ఈ సంవత్సరం నేరాలు 12శాతం తగ్గాయి. గతేడాది 536 చోరీ కేసులు నమోదు కాగా అవి ఏ సంవత్సరం 360గా ఉన్నాయి. పోయినేడు 84 లైంగిక దాడుల కేసులు నమోదవగా ఈ సంవత్సరం 45 కేసులు ఫైలయ్యాయి. 2024లో 622 రోడ్డు ప్రమాదాల్లో 278 మంది చనిపోగా, ఈ ఏడాది 563 యాక్సిడెంట్లలో 204 మంది మృత్యువాత పడ్డారు. 26శాతం రోడ్డు ప్రమాద మరణాలు తగ్గాయి.

Similar News

News December 28, 2025

నేడు నాలుగో టీ20.. భారత్‌కు ఎదురుందా?

image

శ్రీలంక, భారత మహిళా జట్ల మధ్య ఇవాళ నాలుగో T20 జరగనుంది. ఇప్పటికే వరుసగా 3 మ్యాచ్‌ల్లో గెలిచి 5 T20ల సిరీస్‌ను టీమ్ఇండియా చేజిక్కించుకుంది. మిగతా 2 మ్యాచుల్లోనూ విజయం సాధించి క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. మరోవైపు భారత బౌలర్ల ధాటికి లంక బ్యాటర్లు చేతులెత్తేస్తున్నారు. కనీస పోటీ ఇవ్వడం లేదు. ఈ మ్యాచ్‌లోనైనా రాణించాలని ఆశిస్తున్నారు. 7PM నుంచి స్టార్ స్పోర్స్‌లో మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది.

News December 28, 2025

తిరుమల భక్తులకు అలర్ట్

image

తిరుమలలో ఎల్లుండి నుంచి వైకుంఠ ద్వార దర్శనాలను TTD ప్రారంభించనుంది. ఈ క్రమంలో నేటి నుంచి Jan 7 వరకు SSD టోకెన్ల జారీని రద్దు చేసింది. ఈ తేదీల్లో తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద టోకెన్లు ఇవ్వరు. ఈనెల 30, 31, Jan 1 తేదీల్లో ఈ-డిప్ ద్వారా టోకెన్లు పొందిన భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తారు. టోకెన్లు లేనివారిని Jan 2 నుంచి 8 వరకు సర్వదర్శనం క్యూలైన్‌లో అనుమతిస్తారు.

News December 28, 2025

APలో ప్రముఖ ‘ఉత్తర ద్వార’ క్షేత్రాలివే!

image

కదిరి లక్ష్మీనరసింహస్వామి, అన్నవరం సత్యనారాయణ స్వామి, మంగళగిరి పానకాల నరసింహస్వామి, అహోబిలం, ద్వారకా తిరుమల, సింహాచల పుణ్యక్షేత్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఏటా అత్యంత వైభవంగా జరుగుతాయి. వీటితో పాటు విజయవాడలోని రాఘవేంద్ర స్వామి మఠం, నెల్లూరు రంగనాయకుల స్వామి ఆలయం, ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయం, శ్రీకాకుళంలోని శ్రీకూర్మం క్షేత్రాల్లోనూ గతంలో ఉత్తర ద్వార దర్శనాలు కల్పించారు.