News December 25, 2025

పల్నాడు జిల్లాకు అంది వస్తున్న అవకాశాలు.!

image

రాజధాని అమరావతి అభివృద్ధిలో పల్నాడు జిల్లా అంతర్భాగం కావడంతో అవకాశాలు అందివస్తున్నాయి. జిల్లాలోని అమరావతి, పెదకూరపాడు మండలాల్లో భూ సేకరణ జరగబోతుంది. పల్నాడులో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, IT, స్పోర్ట్స్ సిటీ (2,500 ఎకరాలు), టూరిజం ప్రాజెక్టులు రానున్నాయి. 1.5 మిలియన్ ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. జిల్లాలో ఔటర్ రింగ్ రోడ్డు రాకతో భూముల రేట్లు, పెట్టుబడుల అవకాశాలు పెరిగాయి.

Similar News

News February 23, 2026

SKLM: ‘జాతీయ లోక్ అదాలత్‌ను వినియోగించుకోవాలి’

image

మార్చి 14న జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌ను వినియోగించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికారి సంస్థ ఛైర్మన్ జూనైద్ అహమ్మద్ మౌలానా పేర్కొన్నారు. సోమవారం జిల్లా కోర్టులో పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న అత్యధికంగా కేసులు రాజీ చేసేందుకు అధికారులు ప్రయత్నం చేయాలని సూచించారు. మోటర్ యాక్సిడెంట్ కేసుల్లో ఇన్సూరెన్స్ సంస్థలు త్వరితగతిన న్యాయం చేయాలన్నారు. ASP రమణ ఉన్నారు.

News February 23, 2026

మురికి కూపంలో జవహర్‌నగర్.. డంపింగ్ యార్డు వేట!

image

గ్రేటర్‌లో మున్సిపాలిటీల విలీనం చివరకు జవహర్‌నగర్ పాలిట శాపంగా మారింది. సిటీ నుంచి రోజూ దాదాపు 8000 మెట్రిక్ టన్నుల చెత్త అక్కడ చేరుతుండగా.. కొత్త ప్రాంతాల నుంచి వస్తున్న 1500 టన్నుల అదనపు భారం ఆ ఊరిని ఊపిరి పీల్చుకోనివ్వడం లేదు. ఈ నరకం నుంచి స్థానికులకు విముక్తి కల్పించేందుకు ప్రభుత్వం వికేంద్రీకరణ బాట పట్టింది. శివారు ప్రాంతాల్లో కొత్త డంపింగ్ యార్డుల కోసం వేట మొదలుపెట్టింది.

News February 23, 2026

MBNR: పీఎం శ్రీ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

image

పీఎం శ్రీ పాఠశాలల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. సెంట్రల్ అబ్జర్వర్ ఫరీదా మహమ్మద్ బాలానగర్, రాజాపూర్ పాఠశాలలను తనిఖీ చేసి నిధుల వినియోగాన్ని పరిశీలించారు. అనంతరం నిర్వహించిన సమీక్షలో పనుల నాణ్యత, గడువుపై కలెక్టర్ అధికారులకు కీలక సూచనలు చేశారు.