News December 25, 2025

బ్లాక్ స్పాట్స్ లేకుండా చేస్తాం: ఎస్పీ శరత్ చంద్ర పవార్

image

జిల్లాలో ప్రమాదాల నివారణకు బ్లాక్ స్పాట్స్ తగ్గించామని ఎస్పీ శరత్ చంద్ర పవర్ తెలిపారు. 2023లో రహదారిపై 59 బ్లాక్ స్పాట్స్ ఉండగా, 2025 నాటికి 30కి తగ్గించామన్నారు. జిల్లాస్థాయి రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి సం.రం 350-400 వరకు రోడ్డు ప్రమాద మరణాలు ఉండేవని, అలాంటిది ఈ సం.రం 42కు తగ్గాయన్నారు. వచ్చే సం.రం బ్లాక్ స్పాట్స్ లేకుండా చేస్తామన్నారు.

Similar News

News December 26, 2025

నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలి: జాజుల

image

నల్గొండ జిల్లాలో బీసీ వర్గాలకు నామినేటెడ్ పదవుల్లో తగిన అవకాశం కల్పించాలని బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగం గౌడ్ కోరారు. శుక్రవారం హైదరాబాద్‌లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు టికెట్ల కేటాయింపులో జరిగిన అన్యాయాన్ని, నామినేటెడ్ పదవుల ద్వారా భర్తీ చేసి పార్టీలో సముచిత స్థానం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

News December 26, 2025

సాత్విక పొలిటికల్ ఎంట్రీ.. కోమటిరెడ్డి ఆశీర్వాదం

image

మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నూతనంగా నియమితులైన దుబ్బ సాత్విక గురువారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తన రాజకీయ ప్రస్థానానికి మద్దతు తెలపాలని కోరుతూ ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. అందరి సహకారంతో పార్టీ బలోపేతానికి, మహిళా సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయిలో ముందుండి పనిచేస్తానని ఈ సందర్భంగా సాత్విక పేర్కొన్నారు.

News December 26, 2025

పేదల పక్షాన శతాబ్ది పోరాటం: ఎమ్మెల్సీ సత్యం

image

భూస్వామ్య, పెట్టుబడిదారీ వ్యవస్థలకు వ్యతిరేకంగా సీపీఐ సాగించిన పోరాటాలు అద్వితీయమని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం కొనియాడారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మగ్దూమ్ భవన్‌లో పతాకాన్ని ఆవిష్కరించారు. 1925లో కాన్పూర్‌లో ఆవిర్భవించిన నాటి నుంచి రైతు, కూలీ, అణగారిన వర్గాల హక్కుల కోసం సీపీఐ నిరంతరం పోరాడుతోందని, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతామని అన్నారు.