News December 25, 2025

వరంగల్: ఇక ‘పుర’ పోరుకు రంగం సిద్ధం!

image

పంచాయతీ ఎన్నికలు ముగియడంతో పురపాలక సంఘాల ఎన్నికలకు సమాయత్తం అవుతున్నారు. ఉమ్మడి WGLలో 12 పురపాలక సంఘాలకు ఎన్నికలు జరగాలి. ఇప్పటికే 9 పురపాలక సంఘాలకు కాలపరిమితి ముగిసి ఏడాది పూర్తవుతోంది. పరకాలలో 22 వార్డులు, నర్సంపేట-24, వర్ధన్నపేట-12, MHBD-36, డోర్నకల్-15, మరిపెడ-15, తొర్రూరు-16, BHPL-30, జనగామ-30తో పాటుగా కొత్తవి ములుగు-20, స్టే.ఘ-18, కేసముద్రం-16 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి.

Similar News

News December 27, 2025

తిరుమల పరకామణి చోరీ.. హైకోర్టు కీలక ఆదేశాలు

image

తిరుమల పరకామణీ చోరీ కేసు నిందితుడు రవికుమార్‌, ఆయన కుటుంబ సభ్యుల ఆస్తులపై నివేదికను హైకోర్టుకు ఏసీబీ డీజీ సమర్పించారు. పూర్తిగా పరిశీలించిన తర్వాత తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులోని తాజా పరిస్థితుల ఆధారంగా మరో FIR నమోదు చేయాల్సిన అవకాశం ఉందని అభిప్రాయపడింది. ఈ అంశాన్ని పరిశీలించాలని సీఐడీకి సూచించింది. జనవరి 5వ తేదీకి విచారణ వాయిదా వేసింది.

News December 27, 2025

చలికాలంలో పెరుగుతో జలుబు చేస్తుందా?

image

చలికాలంలో పెరుగు తింటే జలుబు చేస్తుందనేది అపోహ అని వైద్యులు చెబుతున్నారు. ‘పెరుగుతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చలికాలంలో మందగించే జీర్ణక్రియకు చెక్ పెట్టి ఆహారాన్ని సులభంగా జీర్ణం చేస్తుంది. అలాగే అందులోని లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది. కాల్షియం ఎముకలు, దంతాల ఆరోగ్యానికి మేలు చేస్తుంది’ అని అంటున్నారు. అయితే ఫ్రిడ్జ్ నుంచి తీసిన పెరుగును వెంటనే తినొద్దని సూచిస్తున్నారు.

News December 27, 2025

ధనుర్మాసం: పన్నెండో రోజు కీర్తన

image

‘లేగదూడలను తలచుకొని గేదెలు కురిపించే పాలధారలతో వాకిళ్లన్నీ తడిసిపోతున్నాయి. ఇంతటి ఐశ్వర్యం కలిగిన గోపాలుని సోదరీ! బయట మంచు కురుస్తున్నా, మేమంతా వేచి ఉన్నాము. శ్రీరాముడు ఆనాడు రావణుడిని సంహరించిన వీరగాథలను మేమంతా భక్తితో పాడుతున్నాము. ఇంత జరుగుతున్నా నీవు మాత్రం నిద్ర వీడటం లేదు. నీ భక్తి పారవశ్యం మాకు అర్థమైంది. ఇకనైనా ఆ నిద్ర చాలించి, మాతో కలిసి ఆ మాధవుని సేవలో పాల్గొనవమ్మా!’ <<-se>>#DHANURMASAM<<>>