News December 25, 2025
వై.రామవరం: పెళ్ళైన ఎడాదికే అనంతలోకాలకు..

అడ్డతీగల మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి ఘటన ఇరు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. దంపతులు ఇద్దరూ వై.రామవరం మండలానికి చెందిన వారు. ఎర్రంరెడ్డివారిపాలెంకి చెందిన నవీన్ కుమార్, చింతకర్రపాలెం గ్రామానికి చెందిన బేబీ కళ్యాణిలకు ఏడాది క్రితమే వివాహం జరిగిందని బంధువులు తెలిపారు. ఇటీవలే మ్యారేజ్ డే కూడా జరుపుకున్నారన్నారు. ఇంతలోనే ఇలా జరగడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలిపించారు.
Similar News
News December 28, 2025
లంచ్ తర్వాత రెగ్యులర్‌గా నిద్ర వస్తుందా? లైట్ తీసుకోవద్దు

లంచ్ తర్వాత తరచూ నిద్రమత్తుగా ఉంటే లైట్ తీసుకోవద్దని వైద్యులు సూచిస్తున్నారు. ‘తరచూ ఈ సంకేతాలు కనిపిస్తే బాడీలో ఇంటర్నల్‌గా మార్పులు జరుగుతున్నట్టు గుర్తించాలి. లంచ్ తర్వాత శరీరంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. వాటిని కంట్రోల్ చేయడానికి బాడీ ఇన్సులిన్ ఎక్కువ రిలీజ్ చేస్తుంది. ఇది సాధారణమే అనిపించినా రెగ్యులరైతే టైప్-2 డయాబెటిస్, హార్ట్ డిసీజెస్, క్యాన్సర్ రిస్క్ ఉండొచ్చు’ అని హెచ్చరిస్తున్నారు.
News December 28, 2025
సిగాచి పరిశ్రమ సీఈవో అరెస్ట్

సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 54 మంది కార్మికుల మరణించిన సంగతి తెలిసందే. ఈ ఘటనకు సంబంధించి సిగాచి ఇండస్ట్రీస్ సీఈవో అమిత్ రాజ్ సిన్హాను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రమాదానికి యాజమాన్యం నిర్లక్ష్యం, భద్రతా లోపాలే కారణమని ప్రాథమిక విచారణలో తేలడంతో పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు.
News December 28, 2025
పీఎం లంక నన్ను దత్తత తీసుకుంది: నిర్మల సీతారామన్

తాను పీఎం లంకను దత్తత తీసుకోలేదని, ఆ గ్రామస్థులే తనను దత్తత తీసుకున్నారని కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ అన్నారు. ఆదివారం అక్కడ జరిగిన సభలో ఆమె మాట్లాడారు. మహిళల మద్దతు మరువలేనిదని పేర్కొన్నారు. తీర ప్రాంత రక్షణ గోడ పనులు జనవరికి పూర్తవుతాయని, సముద్ర తీరం అందం దెబ్బతినకుండా పనులు చేపడుతున్నామని వివరించారు. ఈ ప్రాజెక్టు వల్ల మత్స్యకార గ్రామాలకు రక్షణ లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.


