News December 25, 2025

తూ.గో: విద్యార్థినిపై టీచర్ లైంగిక వేధింపులు

image

మండపేటలోని ఓ ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయుడు విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ట్యూషన్ సమయంలో అసభ్యకర మెసేజులతో వేధిస్తుండటంతో భయపడిన బాలిక పాఠశాలకు వెళ్లడం మానేసింది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు ఈ నెల 22న విచారణ చేపట్టారు. ఈ క్రమంలో సదరు ఉపాధ్యాయుడిని యాజమాన్యం విధుల నుంచి తొలగించింది.

Similar News

News December 28, 2025

అనకాపల్లి: ఈనెల 30న జడ్పీ సర్వసభ్య సమావేశం

image

ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈనెల 30న నిర్వహించనున్నట్లు జడ్పీ సీఈవో నారాయణమూర్తి తెలిపారు. జడ్పీ ఛైర్‌పర్సన్ సుభద్ర అధ్యక్షతన ఉదయం 10:30 గంటలకు విశాఖ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరుగుతుందన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో అన్ని శాఖల అధికారులు పూర్తి నివేదికలతో సమావేశానికి హాజరు కావాలని కోరారు.

News December 28, 2025

నేడు బాలరాముడిని దర్శించుకోనున్న సీఎం

image

AP: నేడు సీఎం చంద్రబాబు అయోధ్యకు వెళ్లనున్నారు. ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి 11 గంటలకు అయోధ్యకు చేరుకుంటారు. శ్రీరామ జన్మభూమి కాంప్లెక్స్‌లో కొలువైన శ్రీరాముడిని దర్శించుకుంటారు. 11.30AM నుంచి 2.30PM వరకు 3 గంటల పాటు బాలరాముడి ఆలయంలోనే ఉండనున్నారు. 3PMకు అయోధ్య నుంచి బయలుదేరి నేరుగా విజయవాడ చేరుకుంటారు.

News December 28, 2025

ములుగు: అకౌంట్ నుంచి రూ.4.80 లక్షల దోపిడీ

image

జిల్లాలోని మల్లంపల్లి(M) రామచంద్రాపురానికి చెందిన ఓ వ్యక్తి సైబర్ మోసానికి గురయ్యాడు. అతడి ఖాతా నుంచి రూ.4.80 లక్షలు ఖాళీ అయ్యాయి. ఎస్సై వెంకటేశ్వర్ రావు తెలిపిన వివరాలు.. ఈ నెల 24న ఓ మెడికల్ షాప్‌లో UPI ద్వారా రూ.700 చెల్లించాడు. అయితే ఖాతాలో డబ్బులు లేనట్లు మెసేజ్ రాగా బ్యాంకులో ఆరా తీయగా ముందు రోజున రూ.4,80,000 అపరిచిత ఖాతాలోకి బదిలీ అయినట్లు గుర్తించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.