News December 25, 2025
వనపర్తి జిల్లా సర్వే అధికారిగా శ్రీనివాసులు

వనపర్తి జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారిగా పి.శ్రీనివాసులు బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. బదిలీల ప్రక్రియలో భాగంగా ఇక్కడ పనిచేస్తున్న జె.బాలకృష్ణ నల్గొండ జిల్లా భూసేకరణ కార్యాలయానికి బదిలీ అయ్యారు. ఆందోల్ ఆర్డీవో కార్యాలయంలో డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసులు, పదోన్నతిపై వనపర్తి జిల్లా సర్వే అధికారిగా నియమితులయ్యారు.
Similar News
News December 30, 2025
ఎన్టీఆర్ భరోసా కింద రూ.117.94 కోట్ల పంపిణీ- కలెక్టర్

జనవరి నెలకు సంబంధించి ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఒకరోజు ముందుగానే, అంటే డిసెంబర్ 31న పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. జిల్లాలో 2.70 లక్షల మంది లబ్ధిదారులకు రూ.117.94 కోట్లు అందజేసేందుకు పటిష్ట ఏర్పాట్లు చేశామన్నారు. కొత్తగా 448 మందికి ‘స్పౌజ్’ పింఛన్లు మంజూరైనట్లు కలెక్టర్ వివరించారు.
News December 30, 2025
NLG: పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి అత్యంత ప్రాధాన్యం: మంత్రి ఉత్తమ్

రాష్ట్రంలోని పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. గత పదేళ్లలో సాగునీటి రంగంలో తప్పిదాలను తాము సరిదిద్దుతున్నామన్నారు. ప్రతి ఎకరాకు నీరు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి తన నియోజకవర్గంలోని పలు ప్రజా సమస్యలను సభ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు.
News December 30, 2025
సంగారెడ్డి జిల్లాలో 4,852 మెట్రిక్ టన్నుల యూరియా: కలెక్టర్

సంగారెడ్డి జిల్లాలో యాసంగి అవసరాలకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని కలెక్టర్ ప్రావీణ్య సోమవారం తెలిపారు. జిల్లాలో ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది లేకుండా సాఫీగా ఎరువులు పంపిణీ జరిగేలా ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. 4,852 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని చెప్పారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు సొసైటీల్లో యూరియా అందుబాటులో ఉందన్నారు.


