News December 25, 2025

ప్రోటోకాల్‌ రగడ.. ఎమ్మెల్యే కవ్వంపల్లికి వరుస అవమానాలు

image

KNR(D)లో ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో MLA కవ్వంపల్లి సత్యనారాయణను విస్మరిస్తూ తరచూ ప్రోటోకాల్ ఉల్లంఘన జరుగుతోంది. నిన్న మైనారిటీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఆహ్వానం అందకపోవడం, ఫ్లెక్సీల్లో ఫోటో లేకపోవడం వివాదాస్పదమైంది. గతంలో సన్నబియ్యం పంపిణీ, గణేశ్ మండపాల విద్యుత్ ఫ్లెక్సీల్లోనూ ఇదేతీరు పునరావృతమైంది. అధికారుల వివక్షపై కాంగ్రెస్ శ్రేణులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాయి.

Similar News

News December 26, 2025

రాష్ట్రంలో తగ్గిన విదేశీ విద్యార్థులు

image

TG: రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో విదేశీ విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. 2012-13లో రాష్ట్రంలో 2,700 మంది విదేశీ విద్యార్థులు ఉండగా, 2021-22 నాటికి ఆ సంఖ్య 1,286కు చేరుకుందని నీతి ఆయోగ్ వెల్లడించింది. ఫలితంగా దేశంలో విదేశీ విద్యార్థులను ఆకర్షించే టాప్-10 రాష్ట్రాల లిస్టులో ప్లేస్ కోల్పోయింది. అటు ఏపీలో ఫారిన్ స్టూడెంట్ల సంఖ్య పెరిగింది. 2012-13లో 679గా ఉన్న సంఖ్య పదేళ్లలో 3,106కు చేరింది.

News December 26, 2025

TPT: 100 ఏళ్ల క్వాంటం కంప్యూటింగ్‌పై చర్చ

image

తిరుపతిలోని NSUలో భారతీయ విజ్ఞాన సమ్మేళనం శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. సైన్స్ అండ్ టెక్నాలజీపై ఎక్స్ పో జరుగుతుంది. DRDO, CSIR, NIF, MPCST, NRSC, PFI, అటామిక్ ఎనర్జి, ఎర్త్ సైన్స్ తదితర రంగాల్లో 80పైగా ప్రదర్శనలు ఎక్స్ పోలో ఉన్నాయి. 100 ఏళ్ల క్వాంటమ్ కంప్యూటింగ్, పరిశోధనలు, AI& ML అప్లికేషన్లు తదితర అంశాలపై చర్చ జరగనుంది.

News December 26, 2025

నారదుడు ఎప్పుడూ ఎందుకు తిరుగుతుంటాడు?

image

నారద ముని ఒకచోట నిలకడగా ఉండలేరన్న విషయం మనకు తెలిసిందే. అయితే దీని వెనుక ఒక రహస్యం ఉంది. సృష్టి కార్యంలో భాగంగా దక్ష ప్రజాపతి కుమారులు సంసారంలో పడకుండా, నారదుడు వారికి వైరాగ్యాన్ని బోధించి సన్యాసులుగా మారుస్తాడు. దీనితో కోపించిన దక్షుడు, నారదుడు ఎక్కడా రెండు గడియల కంటే ఎక్కువ సేపు నిలబడకుండా ఉండేలా శాపం ఇస్తాడు. అది లోకకల్యాణానికి దారి తీసింది.