News December 25, 2025

వేములవాడ భీమేశ్వరాలయంలో బ్లాక్‌లో దర్శనాల దందా

image

వేములవాడ భీమన్న ఆలయంలో బ్లాక్‌లో దర్శనాల దందా కొనసాగుతున్న వైనం వెలుగులోకి వచ్చింది. మేడారం జాతర నేపథ్యంలో భక్తుల రద్దీ పెరగడాన్ని ఆసరాగా చేసుకుని వరంగల్‌కు చెందిన భక్తుల వద్ద రూ.300 చొప్పున వసూలు చేసి దర్శనం కోసం తీసుకువెళ్తున్నట్లు ఆలయ SPF సిబ్బంది గుర్తించి వారిని పట్టుకున్నారు. బ్లాక్ దందాకు పాల్పడుతున్న యువకుడిని చింతల్ ఠాణా ఆర్ అండ్ ఆర్ కాలనీ వాసిగా గుర్తించారు.

Similar News

News December 25, 2025

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్న మంత్రి

image

కాంగ్రెస్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు రెండు రోజుల పర్యటన నిమిత్తం రేపు జిల్లాకు రానున్నారు. హైదరాబాద్ నుంచి బయలుదేరి ఆదిలాబాద్, నిర్మల్, ఖానాపూర్, ముధోల్ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఇటీవల నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచులను మంత్రి ఘనంగా సన్మానించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారిక పర్యటన షెడ్యూల్‌ను విడుదల చేసింది.

News December 25, 2025

198 ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

TGSRTCలో 198 పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది. ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీ 84, మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ 114 ఉద్యోగాలను TSLPRB భర్తీ చేయనుంది. ఈ నెల 30 నుంచి జనవరి 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. నెలకు పేస్కేల్ రూ.27,080-రూ.81,400 ఉంటుంది. అర్హతలు, ఎంపిక ప్రక్రియ వివరాలు <>www.tgprb.in<<>>లో అందుబాటులో ఉంటాయి.

News December 25, 2025

ఇద్దరు మంత్రులు జైలుకెళ్లడం ఖాయం: బండి సంజయ్

image

TG: రాష్ట్రంలోని ఇద్దరు మంత్రులు ₹వేల కోట్ల ఆస్తులు కూడబెట్టారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. వీరిపై కేంద్ర సంస్థలు నిఘా వేశాయని, ఎప్పటికైనా జైలుకెళ్లడం ఖాయమని మీడియాతో చిట్‌చాట్లో వ్యాఖ్యానించారు. ‘TGకి పట్టిన శని KCR కుటుంబం. అందుకే ప్రజలు ఫామ్‌హౌస్‌కు పరిమితం చేశారు. నీటివాటాలలో తప్పుచేసింది కేసీఆరే. CM రేవంత్ భాష సరికాదు. KCRను తిట్టడం వెనుక సింపతీ పెంచే కుట్ర ఉంది’ అని పేర్కొన్నారు.