News December 25, 2025

ప్రధాని మోదీ ‘క్రిస్మస్’ ప్రార్థనలు

image

క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రధాని మోదీ ఢిల్లీలోని కేథడ్రల్ చర్చి ఆఫ్ ది రిడంప్షన్‌లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ‘క్రిస్మస్ స్ఫూర్తి సమాజంలో సామరస్యం, సద్భావాన్ని ప్రేరేపిస్తుంది’ అని పేర్కొన్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ‘ఈ పర్వదినాన దేశ పౌరులకు, ముఖ్యంగా క్రైస్తవ సమాజంలోని సోదర, సోదరీమణులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశారు.

Similar News

News December 25, 2025

198 ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

TGSRTCలో 198 పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది. ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీ 84, మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ 114 ఉద్యోగాలను TSLPRB భర్తీ చేయనుంది. ఈ నెల 30 నుంచి జనవరి 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. నెలకు పేస్కేల్ రూ.27,080-రూ.81,400 ఉంటుంది. అర్హతలు, ఎంపిక ప్రక్రియ వివరాలు <>www.tgprb.in<<>>లో అందుబాటులో ఉంటాయి.

News December 25, 2025

ఇద్దరు మంత్రులు జైలుకెళ్లడం ఖాయం: బండి సంజయ్

image

TG: రాష్ట్రంలోని ఇద్దరు మంత్రులు ₹వేల కోట్ల ఆస్తులు కూడబెట్టారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. వీరిపై కేంద్ర సంస్థలు నిఘా వేశాయని, ఎప్పటికైనా జైలుకెళ్లడం ఖాయమని మీడియాతో చిట్‌చాట్లో వ్యాఖ్యానించారు. ‘TGకి పట్టిన శని KCR కుటుంబం. అందుకే ప్రజలు ఫామ్‌హౌస్‌కు పరిమితం చేశారు. నీటివాటాలలో తప్పుచేసింది కేసీఆరే. CM రేవంత్ భాష సరికాదు. KCRను తిట్టడం వెనుక సింపతీ పెంచే కుట్ర ఉంది’ అని పేర్కొన్నారు.

News December 25, 2025

దేశభద్రతకే వాజ్‌పేయి ప్రాధాన్యం: శివరాజ్ సింగ్

image

AP: ప్రభుత్వమేదైనా దేశభద్రతకే వాజ్‌పేయి ప్రాధాన్యమిచ్చేవారని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కొనియాడారు. ‘ఇది నాదేశం అనే భావన ప్రజల్లో చిరస్థాయిగా నిలిచేలా వాజ్‌పేయి పనిచేశారు. పాక్‌తో యుద్ధంలో ఇందిరకు మద్దతు ఇచ్చారు. కానీ నేడు ఆమె మనవడు రాహుల్ ఆపరేషన్ సింధూర్‌ను, మోదీని విమర్శిస్తున్నారు’ అని అమరావతిలో విగ్రహావిష్కరణ సభలో పేర్కొన్నారు. AP రైతుల సంక్షేమానికి కేంద్రం తరఫున సహకరిస్తానన్నారు.