News December 25, 2025
ఆదోని మండల విభజనపై స్థానికుల నిరసన

ఆదోని మండలాన్ని విభజించి కొత్తగా 17 గ్రామాలతో ‘పెద్ద హరివాణం’ మండలాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై స్థానికంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కొత్త మండల కేంద్రం కర్ణాటక సరిహద్దులో ఉండటం వల్ల చాలా గ్రామాలకు 40 కిలోమీటర్ల దూరం అవుతుందని ఆందోళన, నిరసనలు చేపట్టారు. ఈ అభ్యంతరాలపై రెవెన్యూ శాఖ జిల్లా కలెక్టర్ నుంచి నివేదిక కోరింది. ఈ నెల 28న జరిగే సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
Similar News
News December 27, 2025
కర్నూలు జిల్లాలో 17,089 ఓపెన్ డ్రింకింగ్ కేసులు: ఎస్పీ

కర్నూలు జిల్లాలో బహిరంగ మద్యపానంపై ఉక్కుపాదం మోపుతున్నట్లు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతూ ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి డిసెంబర్ 20 వరకు 17,089 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఇకపై బహిరంగ మద్యపానాన్ని ఏమాత్రం ఉపేక్షించబోమని, ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు.
News December 26, 2025
వీర్ బాల్ దివస్ వేడుకల్లో కర్నూలు కలెక్టర్ సిరి

బాలలకు సరైన అవకాశాలిస్తే అద్భుతాలు సృష్టిస్తారని కర్నూలు జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి అన్నారు. ఢిల్లీలో జరిగిన ‘వీర్ బాల్ దివస్–2025’లో ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. వీర్ బాల్ పురస్కారం అందుకున్న మద్దికెర మండలానికి చెందిన పారా అథ్లెట్ శివానిని కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. బాలల అభివృద్ధికి అన్ని శాఖలు సమన్వయంతో కృషి చేయాలని ఈ సందర్భంగా ఆమె సూచించారు.
News December 26, 2025
మద్దికేర బాలికకు రాష్ట్రపతి చేతుల మీద అవార్డ్

మద్దికేర మండల కేంద్రానికి చెందిన ఉప్పర వీరప్ప, లలితల కుమార్తె శివాని శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రధానమంత్రి జాతీయ బాల పురస్కారం అందుకున్నారు. జావెలిన్ త్రో, షాట్ పుట్‌లో నాలుగేళ్లుగా కనబరుస్తున్న ప్రతిభను గుర్తించి ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. కొన్ని రోజులగా తల్లి అనారోగ్యంతో మృతి చెందినప్పటికీ పట్టు వదలకుండా ముందుకు వెళ్లడంతో గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.


