News December 25, 2025

పశువులకు ‘జోన్స్’ వ్యాధి ఎలా సోకుతుంది?

image

పాడి పశువులు సాధారణంగా మురికినీరు, శుభ్రంగా లేని మేత తీసుకోవడం వల్ల జోన్స్ వ్యాధి సంక్రమిస్తుంది. ఈ వ్యాధి అన్ని రకాల పశువులకు సోకుతుంది. సాధారణంగా గేదెల్లో రెండు ఈతల తర్వాత ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువ. తల్లికి ఈ వ్యాధి ఉంటే పుట్టే దూడకు సోకుతుంది. దీంతోపాటు సహజ, కృత్రిమ సంపర్కం ద్వారా కూడా ఒక పశువు నుంచి మరో పశువుకు సోకుతుంది. సహజంగా పశువుల్లో రోగ నిరోధక శక్తి తగ్గినపుడు ఈ వ్యాధి వస్తుంది.

Similar News

News February 24, 2026

5min లేటైనా పరీక్షకు అనుమతి: ఇంటర్ బోర్డు

image

తెలంగాణలో రేపటి నుంచి ఇంటర్ <<19217020>>పరీక్షలు<<>> జరగనున్నాయి. ఉ.9కి ఎగ్జామ్ ప్రారంభం కానుండగా పరీక్ష సమయానికి 5min లేటైనా విద్యార్థులను అనుమతిస్తామని ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు. అటు APలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు నిన్న ప్రారంభమయ్యాయి. తొలి రోజు 5.24L మంది హాజరయ్యారు. నేడు సెకండియర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. కాగా APలో నిమిషం లేటైనా పరీక్షకు అనుమతించబోమని ఇప్పటికే అధికారులు స్పష్టం చేశారు.

News February 24, 2026

పిల్లలకు ఆన్‌లైన్ లిటరసీ నేర్పిస్తున్నారా?

image

ప్రస్తుతకాలంలో పిల్లలు స్మార్ట్‌ గ్యాడ్జెట్లతోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. అయితే వారికి దీంట్లో ఉండే కష్టనష్టాల గురించి చెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే అంటున్నారు నిపుణులు. SMపై చిన్నప్పటి నుంచే అవగాహన కల్పించాలి. ఏదైనా పోస్ట్ చేసేముందు ఆలోచించాలని, గోప్యతకు ప్రాధాన్యతనివ్వాలని చెప్పాలి. సోషల్‌మీడియా పరిచయాలతో పాటు ఆఫ్‌లైన్‌లో దొరికే మానవ సంబంధాల ప్రాధాన్యత గురించీ వారికి వివరించాలంటున్నారు.

News February 24, 2026

పిల్లలు అబద్ధాలు చెబుతున్నారా?

image

పిల్లలు అబద్ధాలు చెప్పడం కామన్. కానీ అన్నిటికీ అబద్ధాలు చెబుతుంటే మాత్రం పేరెంట్స్ జాగ్రత్తపడాలంటున్నారు నిపుణులు. చాలావరకు తమనుతాము రక్షించుకోవడానికే పిల్లలు అబద్ధాలు చెబుతారు. కాబట్టి దాని వెనక కారణం తెలుసుకోవాలి. నిజం చెప్పినా.. ఎలాంటి సమస్యా ఉండదన్న భరోసా వారికి ఇవ్వాలి. అప్పుడే అబద్ధాలు చెప్పకుండా ఉంటారు. తల్లిదండ్రులు తరచుగా అబద్ధాలు ఉపయోగిస్తే పిల్లలూ అదే నేర్చుకుంటారంటున్నారు నిపుణులు.