News December 25, 2025
గోపాలపురం: రాష్ట్ర స్థాయి క్రికెట్ జట్టుకు యశశ్రీ ఎంపిక

గోపాలపురం(M) పెద్దాపురం గ్రామానికి చెందిన తానింకి యశశ్రీ రాష్ట్ర స్థాయి క్రికెట్ జట్టుకు ఎంపికైంది. గన్నవరంలో జరిగిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్-17 బాలికల పోటీల్లో ఆమె ప్రతిభ కనబరిచింది. యశశ్రీ విజయం పట్ల పెద్దాపురం గ్రామస్థులు గురువారం హర్షం వ్యక్తం చేశారు. కుమార్తెకు చిన్ననాటి నుంచి క్రికెట్ పై ఉన్న ఆసక్తిని గుర్తించి ప్రోత్సహించామని తండ్రి సత్తిబాబు ఈ సందర్భంగా ఆనందాన్ని పంచుకున్నారు.
Similar News
News January 8, 2026
ప్రపంచ పర్యాటక కేంద్రంగా సూర్యలంక బీచ్: కలెక్టర్

సూర్యలంక బీచ్‌ను ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు స్వదేశీ దర్శన్ 2.O కింద రూ.97 కోట్లతో పనులు ప్రారంభించామని కలెక్టర్ డా.వి.వినోద్ కుమార్ తెలిపారు. బీచ్‌లో చేపట్టిన అభివృద్ధి పనులను బుధవారం ఆయన పరిశీలించారు.
పనుల వేగం, నాణ్యతపై సూచనలు చేశారు. పనులన్నీ సెప్టెంబర్‌లోపు పూర్తి చేసి నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. ఫిష్ ఆంధ్ర షాపుల సమస్యలు, గిరిజనుల పునరావాసంపై న్యాయం చేస్తామన్నారు.
News January 8, 2026
పవన్ వద్ద పంచాయితీ.. సదుం వాసుల వాదన ఇది.!

సదుంలో మైనింగ్ కోసం సేకరించిన<<18792414>> భూముల్లో<<>> అధికంగా డీకేటీ భూములు ఉండటంతో పరిహారం అంశం ప్రధాన సమస్యగా మారింది. భూములు కోల్పోయిన రైతులకు తగిన నష్టపరిహారం చెల్లిస్తామని యాజమాన్యం హామీ ఇచ్చినా, పనులు ప్రారంభమైన తర్వాత పరిహారం విషయంలో నిర్లక్ష్యం వహిస్తోందని గ్రామ కమిటీ ఆరోపిస్తోంది. ఈ అంశంపై రైతులు ఇప్పటికే అధికారులకు ఫిర్యాదులు చేసినా స్పష్టమైన పరిష్కారం కనిపించలేదని వారు అంటున్నారు.
News January 8, 2026
MNCL: పదో తరగతి పరీక్షలకు ‘తత్కాల్’ ఫీజు షెడ్యూల్ విడుదల

పదో తరగతి వార్షిక పరీక్షలకు సంబంధించి పరీక్ష రుసుము చెల్లించలేకపోయిన విద్యార్థులకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. 2026 మార్చిలో జరగనున్న పరీక్షల కోసం తత్కాల్ పద్ధతిలో ఫీజు చెల్లించేందుకు షెడ్యూల్ విడుదల చేసినట్లు మంచిర్యాల జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) యాదయ్య తెలిపారు. రూ.1000 అపరాధ రుసుముతో ఈ నెల 21 నుంచి 27వ వరకు పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు.


