News April 24, 2024

డుప్లెసిస్, కరన్‌కు భారీ జరిమానా

image

నిన్న జరిగిన 2 మ్యాచుల్లో ఆర్సీబీ, పంజాబ్ జట్ల కెప్టెన్లకు ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ భారీ జరిమానాలను విధించింది. గుజరాత్‌తో మ్యాచ్‌లో అంపైర్ల నిర్ణయంపై అసహనం వ్యక్తం చేసిన కరన్‌కు మ్యాచ్‌ ఫీజులో 50శాతం కోత పడింది. ఇక KKRతో మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా RCB కెప్టెన్ డు ప్లెసిస్‌కు రూ.12 లక్షల జరిమానా పడింది. మరోసారి స్లో ఓవర్ రేట్ తప్పు చేస్తే రెట్టింపు ఫైన్ విధిస్తామని కమిటీ స్పష్టం చేసింది.

Similar News

News March 25, 2026

తిరుపతి జిల్లాలో 246 మంది డుమ్మా

image

రాష్ట్రవ్యాప్తంగా బుధవారం 10వ తరగతి భౌతిక శాస్త్రం పరీక్ష జరిగింది. తిరుపతి జిల్లా వ్యాప్తంగా 27,068 మంది విద్యార్థులకు గాను 26,822 మంది హాజరుకాగా 246 మంది గైర్హాజరైనట్లు DEO KVN కుమార్ తెలిపారు. ఓపెన్ స్కూల్ సొసైటీ పదో తరగతి పరీక్షలకు సంబంధించి 839 మందికి గాను 732 మంది హాజరై 107 మంది గైర్హాజరు అయినట్లు పేర్కొన్నారు. ప్రశాంతంగా పరీక్షలు జరిగినట్లు ఆయన అన్నారు.

News March 25, 2026

IPL: కెప్టెన్లంతా ఒకే చోట

image

ఐపీఎల్-2026 సందడి మొదలైంది. లీగ్‌లో పాల్గొనే పది జట్ల కెప్టెన్లు ముంబైలో ఒకేచోట కలుసుకున్నారు. సీజన్ ప్రారంభానికి ముందు ఏటా జరిగే ‘కెప్టెన్స్ ఫొటోషూట్’లో వీరంతా పాల్గొన్నారు. హార్దిక్ పాండ్య, రుతురాజ్ గైక్వాడ్, రజత్, పంత్‌, కిషన్, రహానే, పరాగ్, అక్షర్, గిల్, శ్రేయస్ కలిసున్న ఫొటోలను IPL పంచుకుంది. ఈ నెల 28 నుంచి ఈ క్రికెట్ పండుగ షురూ కానున్న విషయం తెలిసిందే.

News March 25, 2026

ఫ్రూట్-ఫ్లేవర్డ్ బీర్లు ఇక రానట్లే

image

TG: రాష్ట్రంలో పండ్లు, ఇతర ఫ్లేవర్డ్ బీర్లను అందుబాటులోకి తెచ్చేందుకు GOVT గతంలో మైక్రో బ్రూవరీల ఏర్పాటు కోసం టెండర్ దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ బ్రూవరీల ద్వారా ప్రతినెల ₹100CR ఆదాయాన్ని ఆర్జించవచ్చనుకుంది. HYDలో 100కు పైగా, ఇతర కార్పొరేషన్లలో20కి పైగా దరఖాస్తులు అందాయి. అయితే టెండర్లు దాఖలు చేసిన కాంట్రాక్టర్లకు మైక్రోబ్రూవరీల ఏర్పాటుకు అవసరమైన అర్హతలు లేకపోవడంతో దరఖాస్తులను తిరస్కరించింది.