News December 25, 2025

జగన్‌కు ముద్దు పెట్టిన విజయమ్మ

image

మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి పులివెందుల సీఎస్‌ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇందులో వైఎస్ కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. ఈ తరుణంలో జగన్ తల్లి విజయమ్మ ఆయనకు కేక్ తినిపించి ముద్దు పెట్టారు. ప్రస్తుతం ఈ ఫొటోను వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాయి.

Similar News

News December 31, 2025

ప్రొద్దుటూరు: న్యూ ఇయర్ వేళ.. ఆ ఇంట్లో విషాదం

image

ప్రొద్దుటూరు శివారులోని జమ్మలమడుగు రోడ్డులో టిప్పర్ ఢీకొని కమలాపురం మండలంలోని సంబటూరు గ్రామానికి చెందిన పొట్టిగారి అయ్యవారు (51) అనే వ్యక్తి మృతి చెందాడు. భార్య దేవికి తీవ్రగాయాలయ్యాయి. మైలవరంలో చదువుతున్న కుమార్తెకు కొత్త సంవత్సరం సందర్భంగా తల్లిదండ్రులు కొత్త బట్టలు ఇచ్చేందుకు వెళ్లి వస్తుండగా.. ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటనపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

News December 31, 2025

ఏపీలో అతి పెద్ద జిల్లాగా కడప..!

image

జిల్లాల పునర్విభజన తర్వాత విస్తీర్ణంలో ఏపీలోనే కడప జిల్లా 12,507 చదరపు కిలో మీటర్లతో అతిపెద్ద జిల్లాగా మారింది. ఇక జనాభాలో రెండవ స్థానంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం 8 నియోజకవర్గాలు, 5 రెవెన్యూ డివిజన్లు, 9 మున్సిపాలిటీలు, 40 మండలాలుగా అవతరించింది. జిల్లాలో 20,60,054 జనాభా ఉండగా.. రాజంపేట నియోజకవర్గంలోని 4 మండలాలు కలవడంతో ప్రస్తుతం 22,96,497కు చేరింది.

News December 31, 2025

కడప: ‘ధాన్యం అమ్మిన మూడు రోజుల్లో డబ్బులు జమ’

image

కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం విక్రయించిన రైతులకు 3 రోజుల్లో డబ్బులు జమ అవుతాయని సివిల్ సప్లై జిల్లా మేనేజర్ నాగసుధ పేర్కొన్నారు. దువ్వూరులోని కొనుగోలు కేంద్రాన్ని బుధవారం సివిల్ సప్లై జిల్లా మేనేజర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ.. ధాన్యం విక్రయించే రైతులకు గోనె సంచులు, హమాలీ ఖర్చులను ప్రభుత్వమే భరాయిస్తుందన్నారు. ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని సిబ్బందికి సూచించారు.