News December 25, 2025
రంపచోడవరంలో 27న ఉద్యోగ మేళా

రంపచోడవరం వైటీసీలో ఈ నెల 27న ఉదయం 10 గంటలకు ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారిణి రోహిణి తెలిపారు. టెన్త్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. ఎలక్ట్రికల్, ఫార్మా తదితర రంగాల్లో ఎంపికైన వారికి నెలకు రూ.10,000 నుంచి రూ.20,000 వరకు వేతనం ఉంటుందని, ఆసక్తి గల నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
Similar News
News April 4, 2026
పెద్దపల్లి: ‘ఈనెల 15 లోపు TSRJC దరఖాస్తులు’

TSRJC ఎంట్రన్స్ పరీక్షకు ఉమ్మడి జిల్లాలో టెన్త్ క్లాస్ చదువుతున్న విద్యార్థులు ఈ నెల 15 లోపు దరఖాస్తు చేసుకోవాలని మేడారం ప్రిన్సిపాల్, కోఆర్డినేటర్ K. విద్యాసాగర్ తెలిపారు. నేరెళ్ల, తాటిపల్లి, హసన్పర్తి (G), మేడారం, పెద్దాపూర్, సర్వేల్ (B) కళాశాలలో ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు ఉంటాయన్నారు. ప్రతి జిల్లాకు 3 KGBVలలో సైతం ఈ ఎంట్రన్స్ ద్వారా ప్రవేశాలు కల్పించి NEET, JEE, CLAT కోచింగ్ ఇస్తారని తెలిపారు.
News April 4, 2026
రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కఠిన చర్యలు: కలెక్టర్

జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షలో ప్రమాద ప్రాంతాల్లో మీడియన్ ఓపెనింగ్‌లను తాత్కాలికంగా మూసివేయాలని సూచించారు. రాంగ్ రూట్ ప్రయాణాలపై సాంకేతిక పర్యవేక్షణతో జరిమానాలు విధించాలని తెలిపారు. రహదారుల వద్ద రంబుల్ స్ట్రిప్స్, జీబ్రా క్రాసింగ్‌లు, కాన్వెక్స్ మిర్రర్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
News April 4, 2026
ముంబై తడ’బ్యాటు’

IPL: ఢిల్లీతో మ్యాచులో టాస్ ఓడి బ్యాటింగ్ చేస్తున్న ముంబై తడబడుతోంది. 10 ఓవర్లలో 73 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. రోహిత్ (35), రికెల్టన్ (9), తిలక్ వర్మ (0) ఔటయ్యారు. సూర్య (29*), రూథర్‌ఫర్డ్ (5*) క్రీజులో ఉన్నారు. ముకేశ్ కుమార్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీశారు. ప్రస్తుతం ముంబై స్కోర్ 11 ఓవర్లలో 80/3గా ఉంది.


