News April 24, 2024

డీప్ ఫేక్‌ వీడియోపై పోలీసులకు రణ్‌వీర్ ఫిర్యాదు

image

నెట్టింట సర్క్యులేట్ అవుతున్న తన డీప్ ఫేక్ వీడియోపై బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముంబై సైబర్ క్రైమ్ సెల్‌ను ఆయన ఆశ్రయించారు. రణ్‌వీర్ ఇటీవల వారణాసిలో పర్యటించారు. ఓ రాజకీయ పార్టీకి మద్దతునిస్తున్నట్లుగా ఏఐ సాయంతో ఆయన గొంతును మార్చిన దుండగులు, వీడియోకు ఆ ఆడియో జత చేశారు. ఈ నేపథ్యంలోనే పోలీసుల్ని ఆశ్రయించినట్లు రణ్‌వీర్ తరఫు ప్రతినిధులు తెలిపారు.

Similar News

News January 26, 2026

రికార్డు సృష్టించిన టీమ్ ఇండియా

image

ICC ఫుల్ మెంబర్ టీమ్‌పై 150+ టార్గెట్‌ను అత్యధిక బాల్స్ (60) మిగిలి ఉండగానే ఛేదించిన జట్టుగా టీమ్ ఇండియా నిలిచింది. NZతో మూడో టీ20లో 154 పరుగుల లక్ష్యాన్ని 10 ఓవర్లలోనే ఛేదించి ఈ ఘనతను అందుకుంది. అలాగే టీ20Iల్లో వరుసగా అత్యధిక సిరీస్‌లు(11) గెలిచిన పాకిస్థాన్ రికార్డును సమం చేసింది. స్వదేశంలో వరుసగా 10 సిరీస్‌లు గెలిచిన ఫస్ట్ టీమ్‌గా అవతరించింది.

News January 26, 2026

ఇంట్లో ఫారిన్ కరెన్సీ ఎంత ఉంచుకోవచ్చు?

image

ఇంట్లో విదేశీ కరెన్సీ నోట్లు ఉంచుకోవడానికి పరిమితి ఉంది. RBI&FEMA నిబంధనల ప్రకారం ఎలాంటి కాల పరిమితి లేకుండా USD 2,000 (లేదా దానికి సమానమైన విదేశీ కరెన్సీ) నోట్లు, ట్రావెలర్స్ చెక్స్ ఉంచుకోవచ్చు. ఒకవేళ అంతకు మించితే 180 రోజుల్లోగా అధికారిక డీలర్(బ్యాంక్) ద్వారా సరెండర్ చేయాలి లేదా RFC అకౌంట్‌లో జమ చేయాలి. విదేశీ నాణేలపై ఎలాంటి పరిమితి లేదు. అన్‌లిమిటెడ్‌గా ఉంచుకోవచ్చు.

News January 26, 2026

అమెరికాకు చైనా అణు రహస్యాలు లీక్?

image

చైనా మిలిటరీ ఆఫీసర్ జనరల్ జాంగ్ యూక్సియా తమ దేశ అణు ఆయుధాల టెక్నికల్ డేటాను USకి లీక్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. భారీ మొత్తంలో లంచాలు తీసుకున్నారని, అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. దీనిపై చైనా రక్షణ శాఖ విచారణ జరుపుతున్నట్లు సమాచారం. షీ జిన్‌పింగ్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన జాంగ్ యూక్సియాపై ఇలాంటి ఆరోపణలు రావడం సంచలనంగా మారింది.