News December 25, 2025

తిరుమలలో నెల్లూరు జిల్లా కలెక్టర్… జిల్లా ప్రధాన న్యాయమూర్తి

image

తిరుమలలో గురువారం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం సందర్భంగా అనుకోకుండా జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీ శ్రీనివాస్ కలుసుకున్నాను. వారు మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రజలకు శ్రీవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, జిల్లా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లేలా స్వామివారి కృప కటాక్షాలు మెండుగా ఉండాలని ఆకాంక్షించారు.

Similar News

News December 29, 2025

నెల్లూరు: గ్రీటింగ్ కార్డులు మాయం..!

image

స్మార్ట్‌ఫోన్ల యుగంలో భావాలను వ్యక్తపరిచే పద్ధతులే మారిపోయాయి. ఒకప్పుడు పండగలు, పర్వదినాలు వచ్చాయంటే చేతిలో గ్రీటింగ్ కార్డు తప్పనిసరిగా ఉండేది. కాలక్రమంలో వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సోషల్ మీడియా వేదికలు శుభాకాంక్షల మార్పిడిని పూర్తిగా డిజిటల్‌గా మార్చేశాయి. ఒక్క క్లిక్‌తోనే సందేశం చేరుతుండటంతో గ్రీటింగ్ కార్డుల అవసరం తగ్గింది.

News December 29, 2025

సైదాపురం: బాలుడిని ఢీకొట్టిన టిప్పర్

image

సైదాపురం ST కాలనీ సమీపంలో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. పులిగిలపాడు సమీపంలోని క్రషర్ నుంచి కంకర్ లోడుతో గూడూరు వైపు ఓ టిప్పర్ బయల్దేరింది. మార్గమధ్యంలో టిప్పర్ అదుపు తప్పి దక్షేశ్(5)పైకి దూసుకెళ్లింది. అతను తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News December 29, 2025

నెల్లూరులోకి గూడూరు.. ఆ రెండు తిరుపతిలోనే!

image

గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలపాలనే డిమాండ్‌తో ప్రజలు ఉద్యమాలు చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి నెల్లూరులో కలపడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. CM చంద్రబాబుతో ఆదివారం జరిగిన చర్చల్లో కొత్త ప్రతిపాదన తెరపైకి వచ్చిందంట. గూడూరు, కోట, చిల్లకూరు మండలాలనే నెల్లూరులో కలిపి.. వాకాడు, చిట్టమూరును తిరుపతి జిల్లాలో కొనసాగిస్తారని సమాచారం. నేటి క్యాబినెట్ మీటింగ్ తర్వాత అధికార ప్రకటన చేయనున్నారు.