News December 25, 2025
నల్గొండ: ‘యాప్‌లో ఒక్క యూరియా బస్తా కూడా లేదు’

ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్‌లో నల్గొండ జిల్లా నిడమానూరు మండలం పరిధిలో ఒక్క యూరియా బస్తా కూడా చూపించడం లేదని స్థానిక రైతులు చెబుతున్నారు. ప్రభుత్వం త్వరగా స్పందించాలని, తమకు బుకింగ్ ఎలా చేసుకోవాలనేది తెలియడం లేదని వాపోయారు. జిల్లాలో స్టాక్ అందుబాటులో ఉందంటున్నారు కానీ ఏ సెంటర్‌లో స్టాక్ ఉందో కనిపించడం లేదన్నారు. కౌలు రైతులకు కూడా బుకింగ్ ఇబ్బందిగా ఉందన్నారు.
Similar News
News December 29, 2025
VJA: రైల్వే ఘటన.. మృతుడి వద్ద రూ. 5.80 లక్షలు

ఎలమంచిలిలో ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ రైలు అగ్ని ప్రమాదంలో విజయవాడ వాసి చంద్రశేఖర్ సుందర్ మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుడి వద్ద ఉన్న బ్యాగులో రూ.5.80 లక్షలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అగ్ని ప్రమాదంలో ఈ నగదులో కొన్ని నోట్లు పాక్షికంగా కాలిపోయాయి. సోమవారం ఉదయం రైల్వే పోలీసులు ఓ సంచిలో ఈ సొమ్మంతా ప్యాక్ చేసి స్వాధీనం చేసుకున్నారు.
News December 29, 2025
మంత్రి రాంప్రసాద్‌రెడ్డికి చంద్రబాబు ఫోన్

AP: <<18702293>>రాయచోటి<<>>ని జిల్లా కేంద్రంగా తొలగించడంపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి కన్నీరు పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనిపై రాంప్రసాద్‌రెడ్డితో సీఎం చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు. ‘విధిలేని పరిస్థితిలోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. రాయచోటి కేంద్రంగా జిల్లా కోసం మీరు పోరాడుతున్నారు. ఒక్క నియోజకవర్గాన్ని జిల్లా చేసే వీలులేకే ఈ పరిస్థితి వచ్చింది’ అని తెలిపారు. రాయచోటి అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు CM హామీ ఇచ్చారు.
News December 29, 2025
T20Iల్లో సంచలనం.. 4 ఓవర్లలో 8 వికెట్లు

T20Iలో భూటాన్ యువ స్పిన్నర్ సోనమ్ యేషే రికార్డు సృష్టించారు. మయన్మార్‌తో జరిగిన మూడో T20Iలో 22 ఏళ్ల సోనమ్ నాలుగు ఓవర్లలో కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 8 వికెట్లు తీశారు. టీ20 ఫార్మాట్‌లో ఒకే మ్యాచ్‌లో 8 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా నిలిచారు. ఈ మ్యాచ్‌లో 127 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మయన్మార్ 45 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక భారత్ నుంచి దీపక్ చాహర్ 2019లో ఒక T20 మ్యాచ్‌లో 6 వికెట్లు తీశారు.


