News December 25, 2025

NGKL: గురుకులాల్లో ప్రవేశాలకు ఆహ్వానం: కలెక్టర్

image

జిల్లాలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను గురుకుల పాఠశాలలో ప్రవేశాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాంఘిక, గిరిజన, వెనుకబడిన, మైనార్టీ గురుకుల పాఠశాలలో 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాల కోసం ఉమ్మడి ప్రవేశాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.

Similar News

News December 27, 2025

బాపట్ల జిల్లా రాష్ట్రంలోనే ఐదో స్థానం: కలెక్టర్

image

గంజాయి ఉత్పత్తుల నియంత్రణ, మహిళలపై నేరాల నియంత్రణలో బాపట్ల జిల్లా రాష్ట్రంలోనే ఐదో స్థానంలో నిలిచిందని కలెక్టర్ వినోద్ కుమార్ చెప్పారు. ఈ విషయంపై ఇటీవల కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు నుంచి బాపట్ల జిల్లా ఎస్పీ ప్రశంసలు అందుకున్నారని అభినందించారు. గంజాయి వంటి మాదక ద్రవ్యాల నియంత్రణపై పాఠశాలలు, కళాశాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు.

News December 27, 2025

గంజాయి వినియోగంపై ఉక్కుపాదం: ఎస్పీ

image

జిల్లాలో మత్తు పదార్థాల నియంత్రణకు పటిష్ఠ చర్యలు చేపట్టామని ఎస్పీ తెలిపారు. గంజాయి వినియోగించే 71 ప్రాంతాలను గుర్తించామని, ‘ఈగల్ టీం’ సమర్థంగా పనిచేస్తోందని పేర్కొన్నారు. ఒడిశా నుంచి సాగుతున్న అక్రమ రవాణాను అడ్డుకోవడంతో పాటు, జిల్లాలో గంజాయి ఉత్పత్తులను పూర్తిగా అరికట్టామన్నారు. యువత మత్తుకు దూరంగా ఉండాలని, నిఘా ముమ్మరం చేశామని ఆయన వివరించారు.

News December 27, 2025

సరిగ్గా నిద్ర పోవట్లేదా..?

image

నైట్ ఔట్‌లు, సినిమాలు, షికార్లు అంటూ కొందరు నిద్రను నిర్లక్ష్యం చేస్తారు. ఇంకొందరు జాబ్ వల్ల సరైన నిద్రలేక అవస్థలు పడుతుంటారు. కారణమేదైనా రోజుకు కనీసం 7గం. నిద్ర అవసరమని వైద్యులు చెబుతున్నారు. శరీరానికి కావాల్సినంత నిద్ర, విశ్రాంతి లభించకపోతే బోలెడు వ్యాధులు చుట్టుముడతాయి. బీపీ, షుగర్, డిప్రెషన్, ఊబకాయంతో పాటు హార్ట్‌స్ట్రోక్, గుండె జబ్బులు కూడా వస్తాయని డాక్టర్స్ హెచ్చరిస్తున్నారు. ShareIt.