News December 25, 2025
క్రిస్మస్ వేడుకల్లో రోజా

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. నగరి మున్సిపాలిటీ నత్తంకండ్రికలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో మాజీ మంత్రి రోజా పాల్గొన్నారు. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పారు. వైసీపీ నాయకులతో కలిసి కేక్ కట్ చేశారు. చిన్నారులకు కేక్ తినిపించారు. యేసు ప్రభువు సూచించిన మార్గంలో అందరూ నడవాలని రోజా సూచించారు.
Similar News
News December 27, 2025
చిత్తూరు జిల్లాలో 1,016 మందికి అబార్షన్లు..!

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అబార్షన్ల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో 2025-26 (ఏప్రిల్ నుంచి డిసెంబర్)లో 20,824 మంది గర్భిణులుగా లెక్కల్లోకి ఎక్కారు. మొదటిసారి గర్భం దాల్చిన వారు 8,007 మందికాగా, రెండోసారి, అంతకుమించి గర్భవతులు 12,816 మంది. వీరిలో ఇప్పటి వరకు 1,016 మంది అబార్షన్లు చేసుకున్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఇవన్నీ క్షేత్ర స్థాయిలో వైద్య సిబ్బంది గుర్తించినవి మాత్రమే.
News December 27, 2025
చిత్తూరు జిల్లాకు కొత్తగా 2472 ఇళ్లులు మంజూరు

PMAY పథకం కింద చిత్తూరు జిల్లాకు కొత్తగా 2,472 ఇళ్లులు మంజూరయ్యాయి. చిత్తూరు మున్సిపాలిటీకి 828, కుప్పం మున్సిపాలిటీకి 575, నగరి మున్సిపాలిటీకి 516, పుంగనూరు మున్సిపాలిటీకి 115, పలమనేరు మున్సిపాలిటీకి 114 ఇళ్లులు మంజూరయ్యాయి. అలాగే బైరెడ్డిపల్లికు 60, గంగవరంకు 85, పలమనేరుకు 60, పెద్దపంజాణికి 110, వీకోటకు 9 ఇళ్లులు మంజూరయ్యాయి. మొత్తం మీద పలమనేరు నియోజకవర్గానికి 438 ఇళ్లు మంజూరయ్యాయి.
News December 27, 2025
పక్కా గృహాల నిర్మాణంలో చిత్తూరు జిల్లా టాప్.!

పక్కా గృహాల నిర్మాణంలో చిత్తూరు జిల్లా 77%తో రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచింది. జిల్లాలో 72,767 గృహాలు మంజూరవ్వగా ఇప్పటి వరకు 53,466 ఇళ్ల నిర్మాణం పూర్తయ్యింది. ఇందుకుగాను ప్రభుత్వం రూ.1,350 కోట్ల బడ్జెట్ కేటాయించగా, ఇప్పటికే రూ.1,033 కోట్లు ఖర్చు చేశారు. ఇంకా 3,387 ఇళ్లు ప్రారంభం కాలేదు. 739 ఇళ్లు పునాది దశలో, 9,642 గోడల దశలో, 46 పైకప్పు, గోడల దశలో ఉండగా, 1,549 ఇళ్లకు పైకప్పు పూర్తయ్యింది.


