News December 25, 2025

BREAKING: HYDలో 36 గంటలు మంచినీళ్లు బంద్

image

కృష్ణా ఫేజ్-1లో మరమ్మతుల కారణంగా DEC 27 6AM నుంచి 28 6PM వరకు మంచి నీటి సరఫరా నిలిపివేస్తున్నారు. మీరాలం, కిషన్‌బాగ్, మొగల్‌పురా, ఫలక్‌నుమా, బహదూర్‌పురా, జహనుమా, సంతోష్‌నగర్, వినయ్‌నగర్, సైదాబాద్, చంచల్‌గూడ, ఆస్మాన్‌గఢ్, యాకుత్‌పురా, బొగ్గులకుంట, నారాయణగూడ, ఆడిక్‌మెట్, శివంరోడ్, చిల్కలగూడ, అలియాబాద్, రియాసత్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్‌, జల్‌పల్లి, తుక్కుగూడ, ఫాబ్ సిటీ, మన్నెగూడలో సరఫరా ఉండదు.
SHARE IT

Similar News

News December 29, 2025

HYD: అందులో మన జిల్లానే టాప్

image

తెలంగాణలో HYDలో అత్యధికంగా 4.82 లక్షల MSME పరిశ్రమలు ఉన్నట్లు MP కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. పరిశ్రమల సంఖ్యలో రంగారెడ్డి జిల్లా 2.84 లక్షలతో రెండో స్థానంలో నిలవగా మేడ్చల్ జిల్లా 2.24 లక్షలతో మూడో స్థానం సాధించింది. MSME రంగం రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కీలకంగా మారిందని అన్నారు. ఉపాధి కల్పనలోనూ, రాష్ట్ర జీడీపీలోనూ ఈ రంగం కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు.

News December 29, 2025

HYD‌లో భారీ అగ్ని ప్రమాదం.. ‘@2వేలు’

image

ఈ ఏడాది జనవరి నుంచి హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి పరిధిలో సుమారు 2,000కి పైగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. అయితే అగ్నిమాపక కేంద్రాల్లో సిబ్బంది కొరతతో సహాయక చర్యలు సకాలంలో అందక ఇబ్బందులు ఎదురవుతున్నట్లు సమాచారం. వాహనాలు, పరికరాల కొరత కూడా సమస్యగా మారింది. ప్రతి ఏడాది ఇదే పరిస్థితి కొనసాగుతుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

News December 29, 2025

HYD: మీ పిల్లలు మాంజా వాడుతున్నారా? జర జాగ్రత్త!

image

చైనా మాంజాతో పాటు కొత్తగా మార్కెట్‌లోకి వచ్చిన వివిధ రకాల మాంజాలతో ప్రమాదం పొంచి ఉంది. మాంజా ఎదుటివారికే కాదు పతంగి ఎగరేసే కుటుంబసభ్యులకూ డేంజర్ డేంజర్ అని గుర్తించాలి. కీసరలో బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తి మాంజాతో తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. కొందరు వ్యాపారులు సంక్రాంతికి నిషేధిత మాంజా అమ్ముతున్నారు. అందరూ బాధ్యతగా భావించి ప్రమాదపు దారాలు అమ్మితే దగ్గరలోని PSలో సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.