News December 25, 2025

SKLM: రథసప్తమిపై ప్రజాభిప్రాయ సేకరణ రద్దు

image

రథసప్తమిపై ప్రజల అభిప్రాయ, సలహాల స్వీకరణ కార్యక్రమం రద్దు చేసినట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 26న శ్రీకాకుళంలోని కలెక్టర్ కార్యాలయంలో జరగనున్న ఈ కార్యక్రమం కొన్ని అనివార్య కారణాల వలన రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లా ప్రజలందరూ ఈ విషయం గమనించాలి కోరారు.

Similar News

News January 2, 2026

నిమిషంలోనే అంబులెన్స్ బయల్దేరింది: శ్రీకాకుళం DMHO

image

రణస్థలం మండలంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాద సమయంలో 108 అంబులెన్స్ సేవలో సాంకేతిక సమస్య తప్ప మరే జాప్యం జరగలేదని DMHO డా.అనిత గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. అంబులెన్స్ రాకలో ఎటువంటి నిర్లక్ష్యం లేదని సాంకేతిక సమస్య వలన సమాచారం చేరడం జాప్యం జరిగిందని ఆమె వెల్లడించారు. 8.08 గంటలకు సమాచారం అందిన వెంటనే 8.09 నిమిషాలకు అంబులెన్స్ బయలుదేరి 2 కి.మీ దూరంలో ఉన్న ప్రమాద స్థలానికి 5 నిమిషాల్లోనే చేరిందన్నారు.

News January 2, 2026

SKLM: న్యూ ఇయర్ కిక్..రూ. 3.75 కోట్ల మద్యం తాగేశారు

image

శ్రీకాకుళం జిల్లాలో నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ఏడాది చివరి రోజు డిసెంబర్ 31న ఉదయం-రాత్రి వరకు మద్యం విక్రయాలు జోరుగా సాగాయి. ఈ అమ్మకాల ద్వారా రూ3.75 కోట్ల ఆదాయం వచ్చినట్లు జిల్లా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారి సీహెచ్ తిరుపతిరావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 176 మద్యం షాపులు, 9 బార్లు ఉన్నాయని ప్రభుత్వ నిబంధనల మేరకు అమ్మకాలు జరిగాయాన్నారు.

News January 2, 2026

శ్రీకాకుళం: న్యూ ఇయర్ వేడుకలు.. 36 మందిపై డ్రంకెన్ డ్రైవ్ కేసులు

image

నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా బుధవారం అర్ధరాత్రి వరకు విస్తృత తనిఖీలు నిర్వహించినట్లు ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సోదాల్లో 36 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయని, 15 మందిపై బహిరంగ మద్యం కేసులు నమోదు చేశామన్నారు. రోడ్డు ప్రమాదాలు, నేర నియంత్రణ లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టినట్లు స్పష్టం చేశారు.