News April 24, 2024
30 వారాల గర్భవిచ్ఛిత్తికి సుప్రీం అనుమతి

బాలిక గర్భం దాల్చిన కేసులో సుప్రీంకోర్టు అసాధారణ తీర్పు చెప్పింది. 30 వారాల గర్భాన్ని విచ్ఛిత్తి చేసుకునేందుకు అనుమతిచ్చింది. మహారాష్ట్రకు చెందిన 14 ఏళ్ల బాలిక అత్యాచారానికి గురై గర్భం దాల్చింది. ఆలస్యంగా విషయం తెలుసుకున్న తల్లి బాలిక గర్భ విచ్ఛిత్తి కోసం బాంబే హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ నిరాశ ఎదురవడంతో సుప్రీంకు వెళ్లారు. దీనిపై విచారణ జరిపిన CJI జస్టిస్ చంద్రచూడ్ గర్భవిచ్ఛిత్తికి అనుమతించారు.
Similar News
News February 3, 2026
నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి వ్యూహం.. గెలుపే లక్ష్యం!

నల్లగొండ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. మనోరమ హోటల్‌లో 13వ డివిజన్ ముఖ్య నాయకులతో భేటీ కాగా, ప్రచార వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ చేరవేయాలని సూచించారు. అభ్యర్థి జానికి మోహన్ రెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించేలా కార్యకర్తలు ఐక్యంగా కష్టపడాలని మంత్రి పిలుపునిచ్చారు. స్థానిక రాజకీయాలు వేడెక్కాయి.
News February 3, 2026
టారిఫ్‌ల తగ్గింపుతో ఆక్వా రైతులకు ఆదాయం: అచ్చెన్న

AP: అమెరికా టారిఫ్‌లను 25 నుంచి 18 శాతానికి తగ్గించడం వల్ల ఆక్వా రంగానికి ఉపశమనం లభిస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. ఆ దేశానికి సముద్ర ఆహార ఎగుమతులు 15% వరకు పెరుగుతాయన్నారు. కేంద్ర బడ్జెట్‌లో సీ ఫుడ్ ప్రాసెసింగ్‌కు అవసరమైన ఇన్‌పుట్స్‌పై కల్పించిన రాయితీలు ఈ రంగానికి అదనపు మద్దతును అందిస్తాయని తెలిపారు. దీంతో రైతులు, మత్స్యకారులకు ఆదాయ స్థిరత్వం, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు.
News February 3, 2026
చేపల చెరువుల్లో నీటి పీహెచ్ స్థాయి ఎంత ఉండాలి?

☛ చేపలు ఎక్కువగా పీహెచ్ స్థాయి 7.0-8.5 మధ్య ఉన్న చెరువు నీటిలో బాగా పెరుగుతాయి. ☛ చెరువులో నీటి పీహెచ్ స్థాయి 6.5 కన్నా తక్కువైతే (ఆమ్ల ధర్మం గల నీరు) చేపలు బలహీనమై, వ్యాధుల బారినపడతాయి. ☛ చెరువులో నీటి పీహెచ్ స్థాయి 9 కన్నా ఎక్కువైతే (క్షార ధర్మం గల నీరు) చేపల మొప్పలు దెబ్బతిని, ప్రాణ వాయువుని గ్రహించే శక్తి చేపల్లో తగ్గుతుంది. అందుకే నీటి పీహెచ్ స్థాయిని ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి.


