News December 25, 2025
ఆ దేశంలో 4 నెలలు క్రిస్మస్ వేడుకలు

ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో వారం నుంచి 10 రోజులు క్రిస్మస్ వేడుకలు చేసుకుంటారు. ఫిలిప్పీన్స్ దేశంలో మాత్రం సుమారు 4 నెలలు విందు వినోదాలతో సెలబ్రేషన్స్ నిర్వహిస్తారు. సెప్టెంబర్ 1న మొదలయ్యే క్రిస్మస్ సెలబ్రేషన్స్ జనవరి మొదటి వారం (త్రీ కింగ్స్ డే) వరకు కొనసాగుతాయి. డిసెంబర్ 16-24 వరకు ‘సింబాంగ్ గబీ’ పేరుతో ప్రత్యేక ప్రార్థనలు చేసి, 24వ తేదీ అర్థరాత్రి ‘నోచే బ్యూనా’ విందుతో ఎంజాయ్ చేస్తారు.
Similar News
News January 8, 2026
క్రమ పద్ధతిలో హిందువులపై దాడులు: షేక్ హసీనా

బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను భారత్‌లో ఆశ్రయం పొందుతున్న ఆ దేశ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా తీవ్రంగా ఖండించారు. అక్కడ మైనారిటీలపై ఒక క్రమ పద్ధతిలో దాడులు జరుగుతున్నాయని NDTVతో చెప్పారు. ఈ హింసను యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వమే అనుమతిస్తోందని ఆరోపించారు. ప్రజలకు రక్షణ కల్పించే విషయంలో సర్కార్ పూర్తిగా విఫలమైందన్నారు. శిక్ష పడుతుందనే భయం దోషుల్లో లేకుండా పోయిందన్నారు.
News January 8, 2026
హార్దిక్ విధ్వంసం.. 31 బంతుల్లోనే

విజయ్ హజారే ట్రోఫీలో హార్దిక్ పాండ్య(బరోడా) సూపర్ ఫామ్ కొనసాగిస్తున్నారు. ఇవాళ చండీగఢ్‌పై 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన ఆయన మొత్తంగా 31 బాల్స్‌లో 75 రన్స్(9 సిక్సర్లు, 2 ఫోర్లు) బాదారు. ప్రియాంశ్(113), విష్ణు(54), జితేశ్(73) రాణించడంతో బరోడా 391 రన్స్ చేసింది. కాగా విదర్భపై తొలి మ్యాచ్‌లోనూ హార్దిక్ 92 బంతుల్లో 133 రన్స్(11 సిక్సర్లు, 8 ఫోర్లు) చేసిన విషయం తెలిసిందే.
News January 8, 2026
ఉల్లికాడలతో ఎన్నో లాభాలు

ఉల్లికాడలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎన్నో లాభాలున్నాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా మహిళల ఎముకలు దృఢంగా ఉండాలంటే సి విటమిన్ ఉన్న ఈ ఉల్లికాడలు ఎక్కువగా తీసుకోవాలి. అలాగే ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు దగ్గూ, జలుబూ రాకుండా చూస్తాయి. రక్తంలోని షుగర్, గ్లూకోజ్ శాతాన్ని అదుపులో ఉంచడంతో పాటు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ బారిన పడకుండా కాపాడతాయి. అలాగే ఇవి కంటి చూపునూ మెరుగుపరుస్తాయి.


