News December 25, 2025
ASF: స్లాట్‌కు 5 క్వింటాళ్లు మాత్రమే విక్రయం

రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం పత్తి రైతులు తమ పంటను విక్రయించుకునేందుకు కపాస్ కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ కోసం అవకాశం కల్పించిందని ASF జిల్లా మార్కెటింగ్ అధికారి అష్పక్ తెలిపారు. CCI వారి ఆదేశాల ప్రకారం స్లాట్ బుకింగ్ నిబంధనలలో మార్పు జరిగిందని.. ఈ నెల 25వ తేదీ నుంచి బుక్ చేసిన స్లాట్‌కు 5 క్వింటాళ్ల వరకు మాత్రమే పత్తిని విక్రయించేందుకు అనుమతి ఉంటుందన్నారు.
Similar News
News January 2, 2026
కొల్లూరు: ‘రూ.11 లక్షల అప్పు చెల్లించాలన్నందుకు దాడి’

ఇచ్చిన అప్పును తిరిగి ఇవ్వాలని అడిగినందుకు దౌర్జన్యం చేసిన కుటుంబంపై కేసు నమోదు చేసినట్లు కొల్లూరు హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావు తెలిపారు. గురువారం ఆయన వివరాల మేరకు.. కొల్లూరుకు చెందిన రాజేశ్వరి వద్ద గూడూరు శ్రీనివాసరావు కుటుంబం రూ.17 లక్షలు ఆప్పు తీసుకుంది. వాటిలో రూ.6 లక్షలు చెల్లించారు. మిగిలిన రూ.11 లక్షలు ఇవ్వాలని రాజేశ్వరి వారిని అడగగా దుర్భాషలాడుతూ దౌర్జన్యానికి దిగారు. ఘటనపై కేసు నమోదైంది.
News January 2, 2026
క్రికెట్ టోర్నమెంట్‌కు కెప్టెన్ దీపికకు ఆహ్వానం

మడకశిర మండలం నీలకంఠాపురంలో గురువారం భారత బ్లైండ్ క్రికెట్ కెప్టెన్ దీపిక అభినందన సభ నిర్వహించారు. ఈ సభలో అగళి ప్రీమియర్ లీగ్ (APL) నిర్వాహకులు గోవిందరాజు, రవి కెప్టెన్ దీపికను కలిసి ఈ సంక్రాంతికి అగళిలో నిర్వహించనున్న APL సీజన్-3 క్రికెట్ టోర్నమెంట్‌కు ఆహ్వానించారు. అనంతరం దీపికకు పుష్పగుచ్ఛం, అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.