News December 25, 2025
అమరావతి రైల్వే లైన్.. మరో 300 ఎకరాల సేకరణ

ఎరుపాలెం-అమరావతి-నంబూరు బ్రాడ్ గేజ్ లైన్ పనుల్లో భాగంగా రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మరో 300 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేసింది. వీరుల్లపాడు, కంచికచర్ల మండలాల్లోని 8 గ్రామాల్లో ఈ భూమిని సేకరించనున్నారు. ఇందులో ప్రభుత్వ, ప్రైవేట్, అసైన్డ్ భూములు ఉన్నాయి. 56.53 కిలోమీటర్ల ఈ ప్రాజెక్టు అమరావతికి రైలు మార్గం కల్పించడంలో కీలకమని అధికారులు అంటున్నారు.
Similar News
News January 9, 2026
గుంటూరులో MDMA మత్తు పదార్థాల పట్టివేత

గంజాయి, MDMA మత్తు పదార్థాలను కొత్తపేట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ వద్ద మున్నా, చిల్లర ప్రేమ కుమార్ విక్రయదారుల నుంచి లిక్విడ్ గంజాయి, MDMA 3.12 గ్రాములు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. గుంటూరు నగరంలో మత్తు పదార్థాల విక్రయం, సేవనం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఈస్ట్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్ హెచ్చరించారు. నిందితులకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించిందన్నారు.
News January 9, 2026
విశాఖ మెట్రోకు మళ్లీ జాప్యం? (1/2)

విశాఖ మెట్రో ప్రాజెక్టు మరోసారి <<18813242>>జాప్యం<<>> దిశగా సాగుతోంది. తాజాగా కేంద్రం ఫీజబులిటీ రిపోర్ట్ సమర్పించాలని కోరడంతో ఆలస్యం తప్పదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన DPRపై కేంద్రం కీలక ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. ప్రయాణికుల సంఖ్య, ఆదాయం, నిర్వహణ వ్యయం, బ్రేక్ ఈవెన్ కాలంపై స్పష్టత కోరింది.
News January 9, 2026
విశాఖ మెట్రోకు మళ్లీ జాప్యం? (2/2)

సుమారు రూ.15 వేల కోట్ల అంచనా వ్యయంతో రూపొందిన విశాఖ మెట్రో ప్రాజెక్టులో కేంద్రం, రాష్ట్రం చెరో 20% భరించాలి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వాటా నిధుల సమీకరణపై సందేహాలు నెలకొన్నాయి. పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి పరిష్కారంగా మెట్రోతో పాటు 12 ఫ్లైఓవర్లు పూర్తైతే నగరానికి ఊరట లభిస్తుందన్న అభిప్రాయం ఉంది. అయితే వేర్వేరు నిర్మాణాల వల్ల ఆర్థిక భారం పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.


