News April 24, 2024

మోదీ, కేసీఆర్ కడుపు మండుతోంది: రేవంత్

image

TG: మోదీ, కేసీఆర్ ఇద్దరూ తోడు దొంగలేనని ఆదిలాబాద్ సభలో సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ‘డిసెంబర్ 9న ఒక దొంగను ఓడగొట్టాం. లోక్‌సభ ఎన్నికల్లో మోదీని ఓడగొట్టాలి. ఆదిలాబాద్‌లో సీసీఐ సిమెంట్ పరిశ్రమను మోదీ, కేడీ కలిసి మూసేశారు. త్వరలోనే దాన్ని తిరిగి తెరిపిస్తాం. ఉచిత కరెంట్‌తో పేదల ఇళ్లు వెలుగుతుంటే మోదీ, కేసీఆర్ కడుపు మండుతోంది’ అని రేవంత్ విమర్శించారు.

Similar News

News November 20, 2024

రోడ్డు ప్రమాదాలు.. గంటకు 20 మంది మృతి

image

దేశంలో రోడ్డు ప్రమాదాలపై కేంద్ర రవాణాశాఖ విడుదల చేసిన నివేదిక ఆందోళన కలిగిస్తోంది. 2023లో 4.80 లక్షల రోడ్డు ప్రమాదాల్లో 1.72 లక్షల మంది చనిపోయారని తెలిపింది. సగటున గంటకు 20 మంది చనిపోయారు. 4.62 లక్షల మంది గాయపడ్డారు. 2022తో పోల్చుకుంటే మృతులు, గాయాలపాలైన వారి సంఖ్య పెరిగింది. అత్యధికంగా UPలో 23,652 మంది, TNలో 18,347 మంది, MHలో 15,366 మంది చనిపోయారు. అటు అత్యధికంగా TNలో 67,213 ప్రమాదాలు జరిగాయి.

News November 20, 2024

‘ఛార్జీలకు డబ్బులు లేవు.. పోస్టులో పద్మశ్రీ పంపండి’

image

పద్మశ్రీ అవార్డు పొందిన అత్యంత పేదవాడైన ఒడిశాకు చెందిన కవి హాల్ధార్ నాగ్ వ్యాఖ్యలను నెటిజన్లు గుర్తుచేసుకుంటున్నారు. ఆయనకు 2016లో కేంద్రం పద్మశ్రీ ప్రకటించింది. అయితే, ఇది తీసుకునేందుకు ఢిల్లీకి వచ్చేందుకు ఆయన వద్ద డబ్బులు లేవు. దీంతో ఆయన అవార్డును పోస్టులో పంపాలని విజ్ఞప్తి చేశారు. అప్పట్లో ఈ వ్యాఖ్యలు వైరలయ్యాయి. ఆయనకు కేవలం మూడు జతల బట్టలు, ఒక కాడలు లేని కళ్లజోడు, రూ.732 మాత్రమే ఉన్నాయి.

News November 20, 2024

Swiggy Instamartలో మోసపోయిన కస్టమర్!

image

Swiggy Instamartలో 400-600గ్రా. బరువున్నట్లు చూపించిన క్యాలిఫ్లవర్‌ను ఆర్డర్ పెడితే కేవలం 145గ్రాములే డెలివరీ అయిందని ఓ కస్టమర్ రెడ్డిట్‌లో పోస్టు చేశారు. తాను ఆర్డర్ పెట్టిన కూరగాయలన్నీ తక్కువ బరువున్నట్లు పేర్కొన్నారు. కస్టమర్ సపోర్ట్‌ను సంప్రదించగా అక్కడా సంతృప్తికరమైన స్పందన రాలేదని వాపోయారు. ఫుల్ రిఫండ్‌కు బదులు ₹89 ఇస్తామని చూపించిందన్నారు. దీంతో Instamartలో ఆర్డర్లు పెట్టేవారు అలర్టయ్యారు.